సుప్రీంకోర్టుకు వెళ్తాం: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు స్పీకర్‌ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ గుర్తు చేశారు.
రీజనబుల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, గురుకులాల్లో పురుగుల అన్నం అంటూ రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు. పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం-మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం. కంచం లో పురుగులు,కాటేసే పాములు,కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం.. అదానితో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కనీస వసతులు లేక, సరిపడా మరుగుదొడ్లు లేక, అనారోగ్యాలతో విద్యార్థుల పోరాటం - లగచర్ల పై లాఠీ విరిచి , రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటం. పురుగుల అన్నం తిని అంబులెన్స్‌లో విద్యార్థులు-పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో రేవంత్, మంత్రుల షికార్లు. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి-విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
ఇది ఇలావుంటే, తెలంగాణలో కేసీఆర్ వల్లే తెలంగాణలో బ్లూ రెవల్యూషన్ వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దాచేస్తే దాగని సత్యం - చెరిపేస్తే చరగని చరిత్ర: కేసీఆర్ తెలంగాణ లో సాధించిన
"నీలి విప్లవం" (Blue revolution). 2016-17 లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గు కు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనం. తెలంగాణ చేపల పెంపకం లో ఉత్తమ "ఇన్ ల్యాండ్ స్టేట్" గా అవార్డు కైవసం చేసుకోవడం కేసిఆర్ విజయం.












Click it and Unblock the Notifications