కొత్త ఆశలు: తెలంగాణపై వారి ఆశలు, చంద్రబాబు చక్రం తిప్పుతారా?
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో ఈసీ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. కొన్నిచోట్ల అసంతృప్తుల బెడద ఉంది.
Recommended Video

అయినప్పటికీ ఆయాచోట్ల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కుతుందని ధీమాగా ఉన్నవారు కూడా ప్రచార రంగంలోకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నాయి. పలు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణలో పొత్తులు కూడా ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ మరో కర్ణాటక అవుతుందా?
మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన సంచలనం రేపింది. నవంబర్‌లో ఫలితాలు వచ్చాక తాము ముఖ్యమంత్రి కావొచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారని, ఇక్కడ మనం ఎందుకు కాకూడదని కార్యకర్తల సమావేశంలో అన్నారు.

మాదే కీలక పాత్ర... తెలుగుదేశం పార్టీ ఆశలు
మరోవైపు, తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ కూడా మేం లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కాదని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా హంగ్ వస్తుందా అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ఎవరికీ సరిపోయే సీట్లు రాకుంటే టీడీపీ, మజ్లిస్, బీజేపీ వంటి తక్కువ సీట్లు వచ్చే పార్టీలు కీలకం కానున్నాయని అంటున్నారు.

ఎవరికి వారే ధీమా కానీ
తెలంగాణలో తెరాస, బీజేపీ ఓంటరి పోరుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఎం, సీపీఐ, జనసేన, కోదండరాం పార్టీలు కూడా పొత్తుల చర్చలో ఉన్నాయి. కాంగ్రెస్, తెరాస ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. తెరాస ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి.

మేజిక్ ఫిగర్‌కు సమీపంలో ఆగితే
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేదా తెరాస మేజిక్ ఫిగర్‌కు సమీపంలో ఆగితే హంగ్ ఏర్పడవచ్చునని, అప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం లేదా మజ్లిస్ కొద్దో గొప్పో సీట్లు సాధిస్తే బీజేపీ కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్‌కు అవసరం పడితే టీడీపీ మద్దతిచ్చినా, ఆ పార్టీ చక్రం తిప్పే అవకాశాలుంటాయి. టీడీపీ కూడా తమకు 40 నుంచి 60 స్థానాల్లో మంచి పట్టు ఉందని, కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే ఎక్కువ స్థానాలు అడగాలని భావిస్తోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications