వెల్‌కమ్: లగడపాటి కొడుకు పెళ్ళికి కెసిఆర్ హజరౌతారా?
హైదరాబాద్: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొడుకు వివాహనికి హజరౌతారా లేదా అనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగుతున్న సమయంలో లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం సమైఖ్యంగానే ఉండాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఆఖరుకు తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రేను చల్లారు లగడపాటి రాజగోపాల్.
అన్ని అడ్డంకులను దాటుకొని తెలంగాణ బిల్లు పాసైంది. అయితే రాష్ట్రం ఏర్పాటు కాదని లగడపాటి రాజగోపాల్ ఆ సమయంలో చెప్పారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

లగడపాటి ఇంట్లో వివాహనికి కెసిఆర్ హజరౌతారా
ఈ 25న హైద్రాబాద్ హైటెక్స్‌లో జరిగే లగడపాటి రాజగోపాల్ కొడుకు వివాహనికి తెలంగాణ ముఖ్యమంత్రి హజరౌతారా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. ఉద్యమ సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఉద్యమకారులు గుర్తు చేస్తున్నారు.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కెసిఆర్ ఈ వివాహనికి హజరయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వెల్‌కమ్ వ్యూహనికి కలిసి రానుందా
తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ వ్యూహన్ని రచిస్తున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో టిడిపి తీవ్రంగా దెబ్బతింది. అయితే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని అడ్డుకొనేందుకు కమ్మ సామాజిక వర్గానికి టిఆర్ఎస్ చేయూత ఇవ్వాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. వెల్‌మ్ వ్యూహన్ని ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు అమలు చేశారు. అదే వ్యూహన్ని కెసిఆర్ అమలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గాన్ని అక్కున చేకూర్చుకొనేందుకు గాను లగడపాటి రాజగోపాల్ ఇంట్లో వివాహనికి హపర్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

పరిటాల శ్రీరామ్ వివాహనికి హజరై కెసిఆర్ ఇలా
పరిటాల శ్రీరామ్ వివాహనికి తెలంగాణ సీఎం కెసిఆర్ హజరయ్యారు. అయితే పరిటాల శ్రీరామ్ వివాహనికి కెసిఆర్ హజరైన సమయంలో కొందరు టిడిపి నేతలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. కెసిఆర్ ఈ వివాహనికి హజరుకావడం కూడ వ్యూహత్మకంగానే ఉందనే ప్రచారం సాగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఈ విషయమై కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు.

వ్యక్తిగత సంబంధాలు, రాజకీయాలు వేరు
తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో లగడపాటి రాజగోపాల్ తీరును తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే అదే సమయంలో లగడపాటి రాజగోపాల్ ఇంట్లో వివాహనికి హజరైతే కెసిఆర్ వ్యతిరేకులు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు. అంతేకాదు ఇప్పటికే కెసిఆర్ క్యాబినెట్లో ఉద్యమంలో పాల్గొనని వారికి పెద్దపీట వేశారనే విమర్శలు కూడ లేకపోలేదు. అయితే వీటన్నింటిని మరోసారి కెసిఆర్ వ్యతిరేకులు తెరమీదికి తీసుకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇలాంటి ఫంక్షన్లకు హజరుకావడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని వాదించేవారు కూడ లేకపోలేదు.












Click it and Unblock the Notifications