కెసిఆర్ నోట ‘ముందస్తు’ మాట!: తెలంగాణలో టిడిపి లేకుండా చేయడమే లక్ష్యమా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు తెలంగాణ శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అంటే ఆయన సన్నిహితులైన కొందరి నుంచి ఔననే సమాధానం వస్తోంది. కెసిఆర్‌ ఇటీవలి కాలంలో మధ్యంతర ఎన్నికల గురించి తరచుగా ప్రస్తావిస్తున్నట్టు చెబుతున్నారు.

కాగా, మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేదాకా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఉప ఎన్నికలు జరిగేంత పరిస్థితి అంతకన్నా లేదు. అయితే కేసీఆర్ నోటి వెంట ఇటీవల ‘మధ్యంతరం', ‘ముందస్తు ఎన్నికలు', ‘శాసనసభ రద్దు' తదితర పదాలు తరచూ ధ్వనిస్తున్నాయట.

సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు కూడా ఆయన ఈ పదాలను వల్లె వేస్తున్నట్లు సమాచారం. అంతేకాక, ఏకంగా అధికార యంత్రాంగం ముందు కూడా ఆయన ఈ పదాలను వాడుతున్నట్లు తెలిసింది. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనతోనే కేసీఆర్ ఈ పదాలను వాడుతున్నారా? లేక ఎమ్మెల్యేలను తన గాటన కట్టేసుకునేందుకే ఈ తరహా వ్యూహానికి తెర తీశారా? అన్న విషయాల్లో స్పష్టత రావట్లేదు.

WIll KCR wants to Pre-election?

ఇటీవల హైదరాబాదు పరిసర నియోజకవర్గాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను ఒకానొక రోజు అల్పాహార విందుకు ఆహ్వానించిన ఆయన నేరుగా వారి ముందు ‘ముందస్తు' ప్రతిపాదన చేశారట. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే ప్రతికూల ఫలితాలు తప్పవన్న వారి వాదనతో కేసీఆర్ విభేదించారట.

అప్పటిదాకా ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టాం కదా, ఎందుకు గెలవలేమంటూ వారిని ఆయన నిలదీశారు. దీంతో వారి నోట మాట రాలేదని సమాచారం. అసలు కేసీఆర్ నోట ఈ ‘ముందస్తు' మాట ఎందుకు వినవస్తోందంటే?, తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పూర్తిగా తుడిచివేయాలన్న ఆలోచనే కారణమని తెలుస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలోని మెజారిటీ ప్రాంతాల్లో టిడిపి తుడిచిపెట్టుకుపోయినా, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సత్తా చాటింది. నగర పరిసరాల నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలన్న దిశగా చర్యలు చేపట్టిన కెసిఆర్, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు.

అయితే, కెసిఆర్ ఆకర్ష్ వల మిగిలిన కొందరిపై ఫలించలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి హైదరాబాదు నుంచి కూడా టిడిపిని సమూలంగా తరిమికొట్టడమనే లక్ష్యం మేరకే కేసీఆర్ ఈ తరహా ఆలోచన చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ముందస్తు ఎన్నికలు వెళ్లడం మాత్రం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+