చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!

హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసులకోసం కక్కుర్తి పడి కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవత్వం మంటగలిపి మనీ కోసం మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా లెక్కగడుతున్నారు కొంత మంది వైద్యులు. కొద్దిపాటి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్న కరోనా రోగులకు 10రోజుల పాటు వైద్యం అందించిన తర్వాత కూడా ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది. బిల్లులు కట్టి రోగిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇవ్వడంతో రోగి బంధువులు అవాక్కవుతున్నారు.

 వైద్యం మాటున వ్యాపారం.. మానవత్వం మరిచిన కొంతమంది వైద్యులు..

వైద్యం మాటున వ్యాపారం.. మానవత్వం మరిచిన కొంతమంది వైద్యులు..

నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలోని కొన్ని ఆసుపత్రులకు కరోనా బాదితులు కామధేనువుల్లా పరిణమిస్తున్నారు. కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్న పేషెంట్ల బలహీనతను కొంతమంది డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆసుపత్రిలో చేరాలని, తగు చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఆసుపత్రిలో చేరేంత వరకూ ఒక లెక్క చేరిత తర్వాత మరో లెక్క అన్న తీరుగా వ్యవహరిస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు. లక్షల్లో బిల్లులు మాత్రం నిర్దాక్షిణ్యంగా కట్టించుకుంటున్నప్పటికి రోగి ఆరోగ్యం ఏమాత్రం మెరుగవ్వకపోవడం కొసమెరుపు.

 ఆసుపత్రిలో చేరక ముందు ఓలెక్క.. చేరిత తర్వాత మరో లెక్క..

ఆసుపత్రిలో చేరక ముందు ఓలెక్క.. చేరిత తర్వాత మరో లెక్క..

నగరం చుట్టు పక్కల కొన్న ఆసుపత్రులు వైద్యం మాటున వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా పేషెంట్లను ఆసుత్రుల్లో చేర్చుకుంటున్న వైద్యులు ఆ తర్వాత తమ ప్రతిభను వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగికి ఎలా మెరుగైన చికిత్స అందించాలనే అంశాన్ని పక్కన పెట్టి ఎంతవరకు బిల్లుల రూపంలో దండుకోవచ్చనే అంచనా వేసుకుని చేయని వైద్యాన్ని చేసినట్టు బిల్లులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా షాద్ నగర్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో అచ్చం ఇలాంటి ఉదంతమే వెలుగుచూసినట్టు తెలుస్తోంది.

రోగుల భయం,బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న డాక్టర్లు.. చేయని వైద్యానికి ఫీజులు

రోగుల భయం,బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న డాక్టర్లు.. చేయని వైద్యానికి ఫీజులు

కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక టెస్టులు చేసి దానికనుగుణంగా వైద్యం అందించాల్సి ఉంటుంది. కాని ఆసుపత్రుల్లో చేరిన తర్వాత రోగిని ప్రతిరోజూ చూడడంగాని, పలకరించే పరిస్థితులుగాని ఉండవు. ఎప్పుడో సాయంత్రం ఓ గంట సేపు రోగి బంధువులకు అవకాశం ఇస్తారు ఆసుపత్రుల యాజమాన్యం. ఆ కొద్ది సమయంలో రోగి తన చికిత్సకు జరుగుతున్న సమాచారాన్ని గాని, తన ఆరోగ్య పరిస్థితిని గానీ పూర్తిగా వివరించుకునే పరిస్తితి ఉండదు. రోగి కూడా తనకు మెరుగైన వైద్యం అందుతుందనే భ్రమల్లో ఉంటాడు కాబట్టి. మెరుగవ్వాల్సిన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, లక్షల్లో బిల్లుల కట్టిన తర్వాత రోగిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లండి అనే డాక్టర్ చెప్పిన తర్వాత గాని అసలు విషయం అర్ధాకాక తలలు పట్టుకుంటున్నారు రోగి బంధువులు.

 ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. అవే ప్రాణాలతో చెలగాటం అడుతున్న కొంతమంది వైద్యులు..

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. అవే ప్రాణాలతో చెలగాటం అడుతున్న కొంతమంది వైద్యులు..

కరోనా రోగులకు సిటి స్కాన్ చేసాం డబ్బులు చెల్లించండి అంటారు ఆసుపత్రుల సిబ్బంది.. కాని సిటి స్కాన్ చేయరు.. మెరుగైన ఆక్సీజన్ అందిస్తున్నాం అంటారు కాని ఆక్సీజన్ పెట్టరు.. రెమ్డిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చామంటారు.. కాని అసలు ఇంజక్షన్లే ఇవ్వరు.. ఐసీయూలో పెట్టామంటారు.. కానీ అది ఐపియూ విభాగమే కాదు.. కానీ వీటన్నిటికి డబ్బులు మాత్రం నిక్కచ్చిగా వసూలు చేస్తున్నారు కొంత మంది వైద్యులు. ఇంత చేసినా రోగి ఆరోగ్యం ఎందుకు క్షీణించింది.?మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఎందుకు సూచిస్తున్నారని నిలదీస్తే వైద్యుల దగ్గర నుండి గానీ, సిబ్బంది దగ్గర నుండి గాని సమాధానం ఉండదు. ఇదీ ప్రస్తుతం నగరంలో కొన్ని ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్యం వెనక దందా.. బెడ్ మీద ఉన్న పేషెంట్ ను బతికించుకోవాలా.. దొంగ వైద్యం చేసి లక్షల బిల్లులు కట్టమంటున్న వైద్యలతో పోరాటం చేయాలా తెలియక అరణ్యరోధన అనుభవిస్తున్నారు రోగి బంధువులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+