'సర్దార్'ను పక్కన పెట్టి, గ్రేటర్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం సర్దార్ చిత్రం షూటింగ్‌కు కొద్ది రోజుల పాటు ఆయన విరామం ఇవ్వవచ్చునని కూడా ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో జనసేన పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చింది. అయితే, జనసేన పోటీ చేసే అవకాశాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపి కూటమికి ప్రచారం చేసే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. టిడిపి, బిజెపి నేతలు కూడా పవన్ కళ్యాణ్‌చే ప్రచారం చేయించాలని భావిస్తున్నారు.

కాగా, గ్రేటర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీయే బలంగా ఉందని, మేయర్ స్థానం గెలుచుకునేందుకు కృషి చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు శనివారం సూచించిన విషయం తెలిసిందే. పాలనా పరంగా రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాల్సి ఉందని చెప్పారు.
టిఆర్ఎస్‌తో రాజకీయ విభేదాలు మాత్రం ఉంటాయని చెప్పారు. టిడిపి శ్రేణులు, నేతలను కాపాడుకోవాలన్నారు. పరిపాలనా పరంగా తెలంగాణ, ఏపీలు కలిసి పని చేస్తాయని, కేసిఆర్‌తో నేను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications