పవన్ కళ్యాణ్‌పై నాగబాబు వ్యాఖ్య: చిరంజీవికి ఝలకా, దారి మారుతోందా?
తనకు రాజకీయాల్లో ఏదైనా చేయాలనిపిస్తే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ద్వారానే చేస్తానని, ఆయనకు తన చేతనైన సాయం చేస్తానని మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తనకు రాజకీయాల్లో ఏదైనా చేయాలనిపిస్తే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ద్వారానే చేస్తానని, ఆయనకు తన చేతనైన సాయం చేస్తానని మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లో తాను ఎవరికైతే మద్దతిచ్చారో ఆ టీడీపీ - బీజేపీలకు దూరం జరిగారు. కాంగ్రెస్ పార్టీ అంటే పవన్‌కు పడనప్పటికీ... ప్రత్యేక హోదా కోసం తన అన్నయ్య చిరంజీవి ఉన్న చేయి గుర్తుతో కలుస్తారా అనే చర్చ సాగుతోంది.
ఎందుకంటే, నాగబాబు నిత్యం అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటారు. ఇటీవల నోట్ల రద్దు అంశం గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ సమయంలోను తన అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని అని చెప్పారు.

ఇంటర్వ్యూలో..
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. చిరంజీవి లేదా నాగబాబులు.. పవన్ కళ్యాణ్ పైన, ఆయన జనసేన పార్టీ పైన ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తారు. ఇరువురం ఓ లక్ష్యం కోసం పని చేస్తున్నామని, దారులు మాత్రమే వేరని చెబుతారు.

ఆ దారి ఒక్కటయ్యేనా?
టిడిపి - బిజెపిలకి పవన్ కళ్యాణ్ దూరం అవుతుండటం.. నాగబాబు వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి - పవన్ కళ్యాణ్ దారి ఒక్కటయ్యేనా ఆనే చర్చ సాగుతోంది. పవన్ కాంగ్రెస్‌లో కలవనప్పటికీ.. తన అన్నయ్య చిరంజీవి ఉన్న కాంగ్రెస్ పార్టీతో 2019 ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్నా కుదుర్చుకోవచ్చని అంటున్నారు.

ఎవరెవరు కలుస్తారో?
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2019 నాటికి పుంజుకున్నప్పటికీ టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదిగే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో టిడిపి - బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ - లెఫ్ట్ - జనసేనలు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చునని అంటున్నారు.

పవన్ కోసం అందరూ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో దూరం పెంచుకోవద్దని టిడిపి సాధ్యమైనంత మేర చూస్తోంది. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఆయన కోసం వేచి చూస్తున్నాయి. ఆయనతో పని చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ ఒక్కటే ఆయనకు ధీటుగా స్పందిస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications