Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్‌పై తెలంగాణ నేతల ఒత్తిడి, కేసీఆర్ వైపేనా.. ఇదీ లెక్క: అదే జరిగితే బాబు-జగన్‌లకు దొరికినట్లే!

హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారింగా 119 నియోజకవర్గాలకు గాను 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు వెళ్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కూడిన మహా కూటమి కొన్ని సీట్లే ఖరారు చేసినప్పటికీ, ప్రచారం మాత్రం నిర్వహిస్తున్నారు.

మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరుపుతూనే, ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. కూటమిలోని ఇతర పార్టీల నాయకులు తమకు టిక్కెట్ వస్తుందనుకున్న వారు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా పలువురు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బహిరంగ సభ ఉండనుంది.

పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు?

పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు?

ఓ వైపు దాదాపు అన్ని ముఖ్యమైన పార్టీలు ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ఎన్నికలపై ఇప్పటి వరకు అధికారింగా స్పందించలేదు. దీంతో ఆయన ఏం చేస్తారనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. తెలంగాణలో పోటీ చేస్తారా, పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతారు లేక పోటీకి దూరంగా ఉంటారా, కనీసం ప్రచారమైనా చేస్తారా అనే చర్చ సాగుతోంది.

16వ తేదీన తేల్చనున్న పవన్ కళ్యాణ్

16వ తేదీన తేల్చనున్న పవన్ కళ్యాణ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే అంశం చర్చ జరుగుతుండగా, ఆయన ఈ నెల 16వ తేదీన తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో భేటీకి సిద్ధమయ్యారు. తెలంగాణలో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై పవన్ నిర్ణయం స్పష్టంగా తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే అంటున్నారు.

తెలంగాణ ఎన్నికలు, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి

తెలంగాణ ఎన్నికలు, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని పక్కన పెడితే, ఆయనపై మాత్రం తీవ్ర ఒత్తిడి ఉందని తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేద్దామని పలువురు పార్టీ నాయకులు, అభిమానులు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట. బలం ఉన్న చోట పోటీ చేద్దామని వారు అంటున్నారు.

40 స్థానాల్లో పోటీ చేద్దామని జనసేనానిపై ఒత్తిడి

40 స్థానాల్లో పోటీ చేద్దామని జనసేనానిపై ఒత్తిడి

ఈ మేరకు పార్టీ నాయకులు ఇప్పటికే జనసేనకు ఏయే చోట్ల బలం ఉందనే అంశంపై సర్వే చేశారని తెలుస్తోంది. జనసేనకు 40 చోట్ల సానుకూలత ఉందని అధినేత దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. అంటే ఆయా చోట్ల గెలవకపోయినప్పటికీ పవన్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా మంచి ఓటింగ్ జనసేనకు నమోదవుతుందని చెబుతున్నారని తెలుస్తోంది. ఈ 40 స్థానాల్లో పోటీ చేయాలని పవన్‌ను నేతలు, కార్యకర్తలు కోరుతున్నారట. ఈ ఒత్తిడి నేపథ్యంలో ఆయన 16న భేటీ అయి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

అందుకే, పోటీ చేయకపోవడమే మంచిదని కొందరి వాదన

అందుకే, పోటీ చేయకపోవడమే మంచిదని కొందరి వాదన

మరోవైపు, జనసేన తెలంగాణలో పోటీ చేయకపోవడమే మంచిదని మరికొందరు అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా అభిమానం వేరు, రాజకీయాలు వేరు అనే విషయం తెలిసిందే. తెలంగాణలో పవన్‌కు అనూహ్యమైన ఫాలోయింగ్ ఉండవచ్చు. కానీ అది సినిమాల వరకే పరిమితమని, రాజకీయం వేరని అంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పోటీ చేసిన సమయంలోనే తెలంగాణలో కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, పైగా ప్రస్తుత రాజకీయ సమీకరణాలు అందుకు అనుకూలంగా లేవని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెలంగాణ రావడానికి సహకరించిన బీజేపీ, ఉద్యమంలో పాల్గొన్న ఇతర పార్టీల మధ్య పోటీ పోటీ నెలకొని ఉందని, ప్రజల్లోను సెంటిమెంట్ కొనసాగుతోందని, ఇలాంటప్పుడు పరీక్షలకు మంచిదని అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ పోటీలో దెబ్బతింటే, ఏపీలో ప్రభావం

ఇక్కడ పోటీలో దెబ్బతింటే, ఏపీలో ప్రభావం

ఇక్కడ పోటీ చేసి, దెబ్బతింటే ఆ ప్రభావం ఏపీలోను పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. తెలంగాణలో పోటీ చేసి దెబ్బతింటే, పవన్‌కు సినిమాల్లోనే బలమని, రాజకీయంగా బలం లేదని తేలిపోయిందని టీడీపీ, వైసీపీలు ప్రచారం చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా ఉన్న టిడిపియే బలహీనంగా మారింది. ఏడేళ్ల క్రితం పార్టీ స్థాపించిన జగన్‌కు తెలంగాణలో నేతలు ఉన్నప్పటికీ, ఏమాత్రం చురుగ్గా కనిపించడం లేదు. తెలంగాణలో పోటీ చేయాలనే ఆలోచన కూడా జగన్‌లో లేదు. పవన్ జగన్‌ను ఫాలో కావడమే బెట్టర్ అని అంటున్నారు.

మద్దతు కేసీఆర్‌కేనా, ఇదీ లెక్క?

మద్దతు కేసీఆర్‌కేనా, ఇదీ లెక్క?

మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. జనసేనకు ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం లేదు. ఏపీలో దీనిని చూపించే విమర్శలు చేస్తున్నారు. పార్టీ నిర్మాణం లేని ఇలాంటి సమయంలో తెలంగాణలో పోటీ చేయకపోవడమే మంచిదని అంటున్నారు. అయితే పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సీపీఎం మొగ్గు చూపింది. పవన్ పోటీ చేసినా, ప్రచారం చేసినా ఎవరికి చేస్తారు, ఆయన రంగంలోకి దిగితే ఎవరికి నష్టం జరుగుతుందనే చర్చ సాగుతోంది. గతంలో ఆయన తెలంగాణలో పర్యటించినప్పుడు కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారు. ఏపీ పర్యటనలోను పలు సందర్భాల్లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడ మరో సమీకరణం కూడా ఉంది. ఏపీలో తాను వ్యతిరేకిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ప్రత్యేక హోదాపై బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు టీఆర్ఎస్‌కేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఏ ప్రకటన చేయకున్నా గతంలో ఆయన వ్యాఖ్యలను బట్టి టీఆర్ఎస్‌కు ప్లస్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సీపీఎంతో కలిసి లేదా ఇతర పార్టీలతో కలిసి రంగంలోకి దిగితే సమీకరణాలు మారే అవకాశాలు లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+