టిడిపికి కెటిఆర్ కొత్త అర్థం: కెసిఆర్‌ను ఢీకొట్టి రేవంత్ రెడ్డి నిలిచేనా?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో మునిగింది. ఓవైపు వరుసగా ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం, మరోవైపు పార్టీకి చెందిన ముఖ్య నేతలు సైకిల్‌ను విడిచి కారు ఎక్కడం ఆ పార్టీ కార్యకర్తలు, మిగిలి ఉన్న నేతలు జీర్ణించుకోవడం లేదు.
అయినప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా లేదని, 2019లో తామే అధికారంలోకి వస్తామని, టిడిపిని ఎవరూ ఏం చేయలేరని తెలంగాణ టిడిపి ముఖ్య నేత రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణలో టిడిపి నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు కూడా పదేపదే చెబుతున్నారు.
అయితే, ఇటీవల పార్టీని కొందరు కీలక నేతలు వీడటాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు ఉన్నది పదిమందే. అందులో ఆర్ కృష్ణయ్య టిడిపితో అంతగా కలిసి ఉండటం లేదు.

గ్రేటర్ ఎన్నికల తర్వాత.. ఎమ్మెల్యేలు వివేక్, ఎర్రబెల్లి దయాకర రావు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ తదితరులు కారు ఎక్కారు. మరోవైపు, వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతిచ్చిన బిజెపి అభ్యర్థి, ఈ రోజు నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు 6లక్షల పైచిలుకు ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి లక్షన్నర పై చిలుకు ఓట్లు రాగా, టిడిపి మద్దతిచ్చిన బిజెపి అభ్యర్థికి లక్షా ముప్పైవేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పరిస్థితి అయితే మరీ దారుణం. హైదరాబాదులో 150 డివిజన్లలో ఒకే సీటుకు పరిమితమైంది. నారాయణఖేడ్ ఎన్నికల్లోను డిపాజిట్ దక్కించుకోలేకపోయింది.
ఇప్పటికే తెలంగాణలో టిడిపి పని ఖతమైందని, మిగిలిన నేతలు కూడా తెరాసనో, మరో పార్టీనో చూసుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే, దీనిని రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కొట్టి పారేస్తున్నారు. తాము తిరిగి పుంజుకుంటామని చెబుతున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడంపై మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... టిడిపి అంటే 'తెలంగాణలో డిపాజిట్లు రాని పార్టీ' అని ఎద్దేవా చేశారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications