తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా బంద్! ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు ఇది షాకింగ్ న్యూస్. మద్యంలో ఎక్కువగా మందు బాబులు ఇష్టపడే ఓ బీర్ బ్రాండ్ తెలంగాణలో సరఫరాను నిలిపివేసింది. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో ఇక రాష్ట్రంలో మందు బాబులకు కింగ్ ఫిషర్ బీర్లు ఎక్కడా దొరక్కపోవచ్చు.

తెలంగాణా బేవరేజెస్ కార్పొరేషన్‌కు బీర్ల సరఫరా ఆపేస్తున్నట్లు కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ ప్రకటించినట్లు సమాచారం. భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు బీర్ల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కింగ్ ఫిషర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం వేసవి కాలంలో కింగ్ ఫిషర్ బీర్లు పెద్ద ఎత్తున సరఫరా కాకపోవడంతో మద్యం షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించిన విషయం తెలిసిందే.

Will the supply of Kingfisher beers be stopped in the state of Telangana

మరో రెండు నెలల్లో వేసవి కాలం ప్రారంభం కానున్న సమయంలో కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం KF బీర్ల అభిమానులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేసవి కాలంలోనే కేఎఫ్ బీర్లకు బాగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు మద్యం షాపుల్లో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. కింగ్ ఫిషర్ బదులుగా తుబర్గ్ లైట్ బీర్లను అమ్ముతున్నారు. చేసేందేం లేక కస్టమర్లు కూడా అవే కొంటున్నారు.

ఇక, ఒకటి రెండు రోజుల్లో ఆయా షాపుల్లో కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ అయిపోయే అవకాశం ఉండటంతో విషయం తెలిసిన మందు బాబులు తరపడుతున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ బ్రాండ్ల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మరింత ఆలస్యం చేయకుండా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పెండింగ్ బిల్లులను చెల్లిస్తే.. రాష్ట్రంలో కేప్ బీర్ల సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. అలా జరగకపోతే మాత్రం కేప్ బీర్ల ప్రియులకు ఇక ఆ బ్రాండ్ బీర్లు రాష్ట్రంలో ఎక్కడా లభించకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+