సెటిలర్లను బెదిరించడంవల్ల జూబ్లీహిల్స్ లో ఓటేయరేమో: BRS
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అధిక సంఖ్యలో ఉన్న సెటిలర్లు టీడీపీకి ఓటేశారు. విభజన జరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ మనుగడ కొనసాగిస్తే తనకు రాజకీయంగా ఇబ్బంది అని గ్రహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకున్నాడు. సెటిలర్లు, వారి వ్యాపారాల మీద ఆధారపడిన హైదరాబాద్ నగరంలో పట్టు పెంచుకునేందుకు కేసీఆర్ కొత్త వ్యూహానికి తెర తీశారు.
సెటిలర్లకు బెదిరింపులు
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోను, అంతకు ముందు కూడా వ్యాపారాలు చేసుకుంటున్న సెటిలర్లను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో బెదిరింపచేశారని ఆ పార్టీ శ్రేణులే చెబుతుంటారు. స్థానిక నాయకులు కూడా పావలా చేయమంటే.. రూపాయి పావలా చేశారు. అదే కేసీఆర్ కు మైనస్ గా మారింది. తమకు ఓటేయకపోతే వ్యాపారాలు చేసుకోలేరని, పార్టీకి ఫండింగ్ ఇవ్వాలని, లేదంటే తీవ్రంగా నష్టపోతారంటూ హెచ్చరించడంతో ఎందుకొచ్చిన గొడవలే అని సెటిలర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు.

టీడీపీ నాయకులంతా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే బెదిరించి వారిచేత ఓట్లు వేయించుకొని గెలుపొందారు. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడుతూ పదే పదే అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పాతాళానికి తొక్కేశాడు.
ముఖం చూపించలేక ఫామ్ హౌస్ లోనే..
దీంతో తాను ఎంతో వ్యతిరేకించే రేవంత్ రెడ్డి, అర్థరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది కేసీఆర్ తోపాటు కేటీఆర్ కూడా జీర్ణించుకోలేకపోయారు. కేసీఆర్ ప్రజలకు ముఖం చూపించలేక ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారుకానీ ప్రజల నుంచి స్పందన మాత్రం రావడంలేదు. ఎందుకంటే అయ్యాకొడుకులిద్దరూ చేసిన రాచకార్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడమే ఇందుకు కారణం.
ప్రతిసారి సెటిలర్లను బెదిరించి ఓట్లేయించుకుందామంటే ఒకటి,రెండుసార్లు కుదురుతుందేమోకానీ ప్రతిసారీ సాధ్యం కాదుగా. గత ఎన్నికల్లో కూడా సెటిలర్లు బీఆర్ఎస్ కే వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఎందుకు వెనక్కి తగ్గుతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సెటిలర్లంతా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపే అవకాశమే అధికంగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి సానుభూతి ఓట్లతో గెలుద్దామనుకుంటున్న బీఆర్ఎస్ కు అదృష్టం కలిసివచ్చే అవకాశం కనపడటంలేదంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications