నన్నే పీఎస్‌కు పిలుస్తారా?: పోలీసులపై టాలీవుడ్ నిర్మాత దాడి
హైదరాబాద్: ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తనను పోలీస్ స్టేషన్‌కు పిలిచారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఓ టాలీవుడ్ నిర్మాత.. ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
ఉస్మానియా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో పాటు వచ్చి వీరంగం సృష్టించారు. ఓ కేసు విషయంలో శివరామకృష్ణను ఇన్‌స్పెక్టర్ పిలిపించారు. అయితే, తననే పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తావా? అంటూ ఇన్‌స్పెక్టర్ మీద నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ దాడి చేసినట్లు సమాచారం. నిర్మాతతోపాటు అతని అనుచరులు.. ఇన్‌స్పెక్టర్ సహా మిగితా పోలీసుల మీద దాడికి పాల్పడినట్లు తెలిసింది.

ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నిర్మాత సహా అతని వెంట ఉన్న అనుచరుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా, నిర్మాతగా బూరుగుపల్లి శివరామకృష్ణ పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.
హీరో రవితేజతో దరువు సినిమాతో సహా యువత, రైడ్, ఏమో గుర్రం ఎగురావచ్చు వంటి సినిమాలను శివరామకృష్ణ నిర్మించారు. సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాత మారారు శివరామకృష్ణ. ఆ తర్వాత అందరి బంధువయ, మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా లాంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు. తాజాగా, ఆయన వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపేశారు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై రాష్‌గా వెళ్లొద్దని చెప్పినందుకు ఆంజనేయులు అనే వృద్ధుడిపై ఓ యువకుడు ఇష్టానుసారం దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన వృద్ధుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
పది రోజుల క్రితం దాడి ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రూ. లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదని మృతుడి కుమారుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి మృతికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications