Wine Shop Close: మందు బాబులకు షాక్.. వైన్ షాపులు బంద్..!
మందు బాబులకు షాకింగ్ వార్త వచ్చింది. జూన్ 4 లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున వైన్ షాపులు మూసివేయనున్నారు. మంగళవారం మద్యం దుకాణాలు మూసేయనున్నారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫలితాల తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జూన్ 4న వైన్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రా బాద్ లలో మొత్తం 16 కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

కౌంటింగ్ సెంటర్ నుంచి 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటా యని చెప్పారు. కాగా మే 13 తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. పోలింగ్ నేపథ్యంలో మే 12,13 తేదీల్లో కూడా వైన్ షాపులు మూసివేశారు. మే నెలలో ఏకంగా నాలుగు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అప్పుడు మే 26, 27 తేదీల్లో 48 గంటలపాటు వైన్ షాపులు క్లోజ్ చేశారు.
ఏప్రిల్ లో శ్రీరామ నవమి సందర్భంగా 17వ తేదీన హైదరాబాద్ జంటనగరాల్లో మద్యం దుకాణాలు మూసివేశారు. అటు ఏపీలో కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వరుసగా మూడు రోజులు మద్యం షాపులు తెరుచుకోవని తెలియడంతో ఆదివారం సాయంత్రం మందుబాబులు షాపుల వద్ద బారులు తీరారు.












Click it and Unblock the Notifications