గర్భిణీ అని కూడా చూడకుండా.. ఎన్నారై భర్త చిత్రహింసలు
భార్యను, ఆరు నెలల బాబును అమెరికా నుంచి తీసుకొచ్చి శంషాబాద్ విమానశ్రయంలో వదిలివెళ్లాడు.
హైదరాబాద్: పెద్దలు కుదర్చిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు. అతను అమెరికాలో పనిచేస్తుండటంతో పెళ్లి తర్వాత భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. అయితే తల్లి మాటలను విని భార్యను నిత్యం వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. చివరకు గర్భంతో ఉందని కూడా చూడకుండా ఆరు నెలల బాబును, భార్యను ఎయిర్ పోర్టులో వదిలివెళ్లిపోయాడు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ రామంతాపూర్ కు చెందిన యాలాల సాయి రెడ్డికి సూర్యపేట జిల్లా కోదాడ కు చెందిన శిరిషకి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం సాయిరెడ్డి భార్యను కూడా తనతో పాటు అమెరికా తీసుకెళ్లాడు.

అక్కడ తల్లి చెప్పుడు మాటలు విని భార్య చిత్రహింసలకు గురిచేశాడు. ఇదే క్రమంలో ఈ నెల 15న భార్యను, ఆరు నెలల బాబును అమెరికా నుంచి తీసుకొచ్చి శంషాబాద్ విమానశ్రయంలో వదిలివెళ్లాడు. దీంతో నిస్సహాయ స్థితిలో శిరీష పోలీసులను ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
ఏం చేయాలో పాలుపోని స్థితిలో చివరకు ఆమె బాలల హక్కుల సంస్థను ఆశ్రయించింది. తన భర్త తనతో కాపురం చేసేలా చూడాలని, తల్లి చెప్పుడు మాటల వల్లే అతనలా ప్రవర్తిస్తున్నాడని శిరీష పేర్కొంది. శిరీష ఫిర్యాదుపై బాలల హక్కుల సంస్థ ప్రతినిధులు స్పందించారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టనివ్వకుండా బాబుని తల్లి నుంచి వేరు చేసిన భర్త, అత్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications