ఆటోలో యువతి వీడియో చిత్రీకరణ, నిర్భయ కేసు
హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళను వీడియో తీశాడు. దీంతో పోలీసులు అతని పైన నిర్భయ కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలానికి చెందిన వీరయ్య ఎల్లమ్మబండకు వచ్చాడు.
శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో భాగ్యనగర్ కాలనీకి వెళ్లడానికి ఎల్లమ్మబండలో ఓ ఆటో ఎక్కాడు. అతను ప్రయాణిస్తున్న ఆటోలోనే ఉన్న యువతిని ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. గమనించిన కొందరు ఆటో డ్రైవర్లు బాధిత యువతికి చెప్పారు.

ఆమె అతని వద్ద నుంచి సెల్‌ఫోన్ తీసుకుంది. ఫోన్లో చూడగా.. తన వీడియో కన్పించింది. దీంతో నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అతనిని కొందరు ఆటో డ్రైవర్లు పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications