అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య

ఖైరతాబాద్: గత నెల 20న హైదరాబాదులోని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ఇంటిలో వృద్ధుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన కేసులో మిస్టరీ వీడింది. భార్యే హంతకురాలని తేలింది. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఆమె భర్తను హతమార్చింది. సెంట్రల్ జోన్ డీసీసీ వీబీ కమలాస్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను పట్టుకున్నారు.

సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ కె. పూర్ణచందర్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని పెట్రోల్ పంప్ పక్కన నివసిస్తున్న సయ్యద్ అమ్జద్ అలీ (54)కి భార్య, ముగ్గురు కుమారులున్నారు. భార్య (40)కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో నిలదీశాడు. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెకు నాలుగేళ్లుగా సన్నిహితుడిగా ఉంటున్న బొరబండలో నివసించే తయాబ్ (25)తో కలిసి ఆగస్టు 1న హత్యకు పథకం వేసింది.

Woman arrested for killing husband in Hyderabad

ఈ క్రమంలో బోరబండకు చెందిన తయాబ్ బాల్యమిత్రుడు అమీర్‌ఖాన్ (24)ను కలిశారు. అతనికి రూ.3 లక్షల డబ్బు ఎర చూపి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందు వేసుకున్న పథకం ప్రకారం - సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 4.04 గంటలకు నల్లా నీటి కోసం భర్త అలీని నిద్రలేపింది. దీంతో అమ్జద్ అలీ ఇంటి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉన్న నల్లా పైపుకు పైపును అమర్చి తిరిగి వచ్చాడు.

అమీర్‌ఖాన్ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడతో అమ్జద్ తలపై బలంగా మోదాడు. దీంతో కుప్పకూలిపోతున్న అమ్జద్‌ను అతని భార్య ఇనుప స్పానర్‌తో తలపై మరో దెబ్బ వేసింది. అదే క్రమంలో అటువైపు వెళ్తున్న అమ్జద్ మేనల్లుడు సాజిద్‌ను చూడగానే అమ్జద్ భార్య బోరున విలపిస్తూ తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ విలపించడదం ప్రారంభించింది.

దీంతో భార్య, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డ అమ్జద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గత నెల 21న మృతిచెందాడు. సైఫాబాద్ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేయగా, డీసీపీ నేతృత్వంలో పోలీసుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఎట్టకేలకు భార్యకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ప్రధాన నిందితురాలితో పాటు, తయాబ్, అమీర్ ఖాన్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితులపై హత్యానేరం, హత్యకు కుట్ర కేసులను నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+