శంషాబాద్‌లో యువతి అరెస్ట్: మొయిన్ ప్రియురాలు, ఐసిస్‌తో సంబంధాలు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద కదలికలు ఉన్నట్లుగా అనుమానం కలిగిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ అనే యువతిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు.
నిక్కీ ఇస్లామిక్ ఉగ్రవాదంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిక్కీకి మోయినుద్దీన్‌తో సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. మోయినుద్దీన్ గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడు.
నిక్కీ హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని పక్కా సమాచారం తెలియడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మోయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమెకు సంబంధాలు మాత్రమే కాక.. ప్రియురాలు అని తెలుస్తోంది.

నిక్కీ పూర్తి పేరు నిక్కీ జోసెఫ్. ఆమె ఇంగ్లాండ్ దేశానికి చెందిన యువతిగా సమాచారం. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియాతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.
నిక్కీ... హైదరాబాదుకు చెందిన పలువురిని ఐసిస్‌లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. మోయినుద్దీన్‌తో కలిసి ఓ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఈమెకు 2011లోనే మొయినుద్దీన్‌తో పరిచయమైంది. నగరంలో కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన అనంతరం దుబాయ్ వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చింది. నిక్కీకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయమై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ముప్పై మందికి పైగా వ్యక్తులు శంషాబాదులో అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications