పెళ్లి కుదిరింది: ఇంతలోనే!.., అది తట్టుకోలేక యువతి ఆత్మహత్య..
ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని భావన తండ్రి కుమార్‌గౌడ్ తోను గొడవకు దిగాడు.
షాద్‌నగర్: ప్రేమ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. తాను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించాలని వెంటబడ్డ యువకుడు ఆమె పెళ్లి కూడా రద్దయ్యేలా చేశాడు. తట్టుకోలేకపోయిన యువతి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

పెళ్లి కుదిరింది:
షాద్‌నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన కుమార్‌గౌడ్ కుమార్తె భావన(23). ఏడాది క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసిన భావనకు ఇటీవలే మహబూబ్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం నిశ్చయమైంది.

ఇంతలోనే:
షాద్ నగర్‌కు చెందిన గిరీష్ గౌడ్ ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా భావనను వేధిస్తున్నాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని భావన తండ్రి కుమార్‌గౌడ్ తోను గొడవకు దిగాడు. దీంతో గతంలో అతనిపై కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో గిరీష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు పోలీసులు.

పెళ్లి రద్దయ్యేలా:
ఎలాగైనా భావన పెళ్లి రద్దు చేయించాలని గిరీష్ గౌడ్ భావించాడు. భావనతో పెళ్లి నిశ్చయమైన యువకుడికి ఫోన్ చేసి.. తాను, భావన ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకోవద్దని తెలిపాడు. దీంతో వరుడి బంధువులు వివాహ రద్దుకు సిద్దపడ్డారు.

తట్టుకోలేకపోయిన భావన:
నిశ్చయమైన పెళ్లి కాస్త రద్దు కావడంతో భావన తట్టుకోలేకపోయింది. తన పరువు, కుటుంబ పరువు పోయిందని తీవ్ర మనస్తాపం చెందింది. గురువారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కుమార్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications