తమిళిసై స్ఫూర్తిగా: తెలంగాణ గవర్నర్ సెక్యూరిటీ టీమ్ కానిస్టేబుల్: మాస్కులు కుడుతూ..పంపిణీ చేస్తూ

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల విలువ ఏంటో అందరికీ తెలిసి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే మాస్కులను ధరించడం తప్పనిసరి. మాస్కులకు లభిస్తోన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మెడికల్ షాపుల యజమానులు. సాధారణ రోజుల్లో అయిదు రూపాయల విలువ చేసే మాస్కులు వందకు పైగా అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంత రేటు పెట్టి కొనడానికి బదులుగా కర్చీఫ్‌లను వాడుతున్న వారు చాలామందే ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో మాస్కుల కొరతను అధిగమించడానికి ఓ మహిళా కానిస్టేబుల్ శ్రమిస్తున్నారు. ప్రతి రోజూ 500లకు పైగా మాస్కులను కుడుతూ.. వాటిని స్వయంగా ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆమె పేరు బీ అమరేశ్వరి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సెక్యూరిటీ టీమ్‌లో పని చేస్తున్నారు. రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తూనే..ఖాళీ సమయంలో మాస్కులను కుడుతున్నారు. వాటిని ఉచితంగా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో డాక్టర్లు, నర్సులు, పోలీసు కానిస్టేబుళ్లు, పారిశుద్ధ్య కార్మికులపై ఉన్న ఒత్తిడి వేరే విభాగాల ఉద్యోగులకు ఉండకపోవచ్చు.

Woman Constable B Amareswari stitching and distributing masks in Hyderabad

పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఉన్న ఖాళీ సమయంలో మాస్కులను కుడుతున్నారు అమరేశ్వరి. ప్రతి రోజూ కనీసం 500 మాస్కులను కుడుతున్నారు. వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కనీసం 7000 మాస్కులను తయారు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అమరేశ్వరి స్వస్థలం నల్లగొండ జిల్లా. తన తల్లిదండ్రులతో కలిసి కాటేదాన్‌లో నివసిస్తున్నారు. 2008లో ఆమె అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. పలు చోట్ల పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది టీమ్‌లో ఉన్నారు.

Woman Constable B Amareswari stitching and distributing masks in Hyderabad

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటిదాకా మూడువేలకు పైగా మాస్కులను పంపిణీ చేశానని అన్నారు. లాక్‌డౌన్ ముగిసేంత వరకూ మాస్కులను కుట్టి, పంపిణి చేస్తానని అన్నారు. పేదలకు చేతనైనంత సహాయాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేాయాలంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు సూచిస్తుంటారని, ఆమె మాటలను స్ఫూర్తిగా తీసుకుని తాను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అన్నారు. విధులను ముగించుకున్న తరువాత దొరికే ఖాళీ సమయంలో మాస్కులను కుడుతున్నానని, తన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+