ఇండికా కారులో మహిళ మృతదేహం, ఆమె ఎవరు?
హైదరాబాద్: బేగంపేట పోలీసు స్టేషన్‌కు దగ్గరలో ప్రకాశ్ నగర్‌లో నిలిపి ఉంచిన ఓ ఇండికా కారులో మహిళ మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ఇండికా కారు నుడి దుర్గంధం వెలువడటంతో స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే కారు వద్దకు చేరుకున్నారు. అందులో మహిళ మృతదేహంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. మహిళ మృతదేహం గుర్తు పట్టకుండా ఉంది.

దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, గత కొంతకాలంగా కారు అక్కడే ఉంటుందని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఆ కారు ఎంతకాలం నుండి అక్కడ ఉంటుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వివరాలు లేకపోవడంతో పోలీసులు కారు యజమాని ఎవరు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మృతురాలు యాచకురాలు అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమె సదరు కారులో నివాసం ఏర్పరుచుకుందా లేక దుండగులు హత్య చేసి కారులో పడేశారా అనే కోణంలోను విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications