పెళ్లైన నెలలకే వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్: కొత్తగా పెళ్లైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన హైదరాబాదులోని మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. ఆమె భర్త, ఆయన తరపు వారు ఆమెను హత్య చేశారని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతురాలి పేరు లీలావతి అని తెలుస్తోంది. మహిళ తరఫు వారి ఆరోపణల ప్రకారం... ఆమె భర్త శశికిరణ్ , అత్తింటి వారు నిత్యం ఆమెను అదనపు కట్నం కోసం వేధించేవారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరం పైన గాయాలు ఉన్నట్లుగా తేలిందని తెలుస్తోంది. మల్కాజిగిరి పోలీసులు భర్త, అత్తింటి వారి పైన కట్నం కేసు పెట్టారు.

ఇదిలా ఉండగా, లీలావతి ఫ్యాన్‌కు ఉరేసుకొని చిపోయిందని, అంతకుముందే తన చేతికి గాయం చేసుకుందని చెబుతున్నారు. ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకున్న విషయం తెలిసి తాము తలుపులు బద్దలు కొట్టి ఆమెను రక్షించే ప్రయత్నం చేశామన్నారు.

రిసెప్షనిస్ట్ పని: లేడీ టెక్కీపై హోటల్లో అత్యాచారయత్నం

లీలావతికి 2015 అక్టోబర్ నెలలో పెళ్లైంది. ఆ సమయంలో కట్నంగా పది లక్షల రూపాయలు, 100 గ్రాముల బంగారం, మూడు ఎకరాల మామిడి తోటను రాసి ఇచ్చినట్లుగా మహిళ బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నెల రోజులు బాగానే ఉన్నారని, ఆ తర్వాత అదనపు కట్నం కోసం బాధపెట్టారని ఆరోపిస్తున్నారు.

గత జనవరి నెలలో ఆమె తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చిందని, అప్పుడు పంపించేందుకు వారు ఇష్టపడలేదని అంటున్నారు. అయితే, తర్వాత పెద్దలు ఓ లక్ష రూపాయలు ఇచ్చి పంపించమని సూచించగా అలా చేసినట్లు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Woman found dead, kin say it’s murder

యువతిపై అత్యాచారయత్నం

ఓ హోటల్లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న యువకుడు అదే హోటల్లో దిగిన ఓ ఒంటరి యువతిపై అత్యాచార యత్నం చేశాడు. ఈ సంఘటన ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.

కృష్ణాజిల్లా కోడేరు మండలంలోని మండపాకల గ్రామానికి చెందిన దాసరి శేఖర్‌ విజయపురిలో ఉంటున్నాడు. అతనికి పెళ్లైంది. మూడేళ్లుగా ఎల్బీన గర్‌లోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్నాడు. విశాఖకు చెందిన ఓ యువతి ఉద్యోగరీత్యా నగరానికి వచ్చి హోటల్‌లో సోమవారం దిగింది.

శేఖర్‌ మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో తన క్యాబిన్‌ నుంచి వెళ్లి సీసీ కెమెరాలను ఆపేశాడు. తన వద్దనున్న మాస్టర్‌ కీ సాయంతో ఆమె గది తలుపు తెరిచి అత్యాచారానికి యత్నించగా కిందకి పరిగెత్తుకొచ్చింది. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా నిర్భయ కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+