మద్యం మత్తులో మహిళ హల్‌చల్: రాళ్లు, బాటిల్స్ విసిరి, పోలీసులపై తిట్ల వర్షం (వీడియో)

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో చాలామంది మందుబాబులు పట్టుబడ్డారు.

పోలీసులు పలు ప్రాంతాల్లో 103 కార్లు, 43 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సీజ్ చేశారు. పలు కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. వారిని కోర్టులో హాజరుపరుస్తారు. వీరిలో పలువురు గతంలో పట్టుబడిన వారే.

Woman hulchul drunk and drive in Hyderabad

ఇదిలా ఉండగా, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సమయంలో ఫిలిం నగర్లో ఓ యువతి హంగామా సృష్టించింది. మద్యం మత్తులో కారు దిగి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

పోలీసులను అసభ్య పదజాలంతో దూషించింది. మీడియా ప్రతినిథులు, స్థానికుల పైకి రాళ్లు రువ్వింది. పోలీసుల పైకి వాటర్ బాటిల్స్ విసిరేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల సమయంలో ఆమె తన స్నేహితుడితో కలిసి కారులో మద్యం మత్తులో వెళ్తున్నారు. పోలీసులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆమె కల్పించుకొని మా కారును ఎందుకు ఆపారంటూ హంగామా సృష్టించింది. పోలీసులపై వాటర్ బాటిల్స్, మీడియా ప్రతినిధులపై రాళ్లు, ఫోటో గ్రాఫర్లపై చేయి చేసుకోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+