ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేశాడు: భర్త ఇంటి ముందే శవం సమాధి
ఖమ్మం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే హత్య చేశాడో వ్యక్తి. అతని ఇంటి ఎదుట మృతదేహాన్ని ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని గోవింద్రాలలో ఆదివారం చోటుచేసుకుంది. కామేపల్లి మండలంలోని గోవింద్రాల గ్రామానికి చెందిన సపావట్ నెహ్రు అదే గ్రామానికి చెందిన పద్మ గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమను ఇరువర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో గ్రామంలోని కులపెద్దలు పంచాయతీలో ఆరు నెలల తర్వాత వివాహం జరిపించారు. వారికి ఒక పాప పుట్టింది. అప్పటి నుంచి పద్మ నెహ్రు నివాసంలో ఉంటుంది. వివాహమైన కొద్ది రోజుల తర్వాత నెహ్రుతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరులు తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ కట్నం తేవాలని చిత్రహింసలు పెట్టడంతో ఈ విషయాన్ని పద్మ తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీసులకు తెలిపింది.

పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం నెహ్రు హైదారాబాద్ చేరుకొని అక్కడే ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో పద్మ సుమారు 7నెలల క్రితం భర్త నివాసం ఉంటున్న హైదారాబాద్ ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పద్మను హత్య చేసి విద్యుదాఘాతంతో మృతి చెందిన్నట్లు చిత్రీకరించాడు. అయితే, తానే హత్య చేసినట్లు అతను పోలీసు విచారణలో చెప్పాడు.
పద్మ మృతదేహన్ని కుటుంబ సభ్యులు గోవింద్రాల గ్రామంలోని భర్త నివాసం ఇంటి ఎదుట బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో నెహ్రు తల్లిదండ్రులు, సోదరులు ఇంటికి తాళం వేసి పరారీ కావడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు భర్త ఇంటి ఎదుటే పద్మ మృతదేహన్ని పూడ్చి పెట్టారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గ్రామం నుంచి తరలించాలని వారించినప్పటికి బంధువులు వినలేదు. దీంతో స్థానిక గ్రామపెద్దలకు విషయం తెలియజేసి వారిని అంగీకరింపజేసి పద్మ మృతదేహన్ని పూడ్చిన స్థలం నుంచి శ్మాశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications