అలా చేస్తే శిక్ష తర్వాత ప్రియుడితో ఉండొచ్చనే డ్రామా: భర్తను చంపిన దేవిక ప్లాన్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో భర్త జగన్ నాయక్‌ను ప్రియుడు బెనర్జీతో కలిసి హత్య చేసిన దేవిక విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భర్తను చంపేసినప్పటికీ.. ఆవేశంలో హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకుంటే ఆ తర్వాత కొద్దిగా శిక్ష పడుతుందని, జైలు నుంచి విడుదలయ్యాక ప్రియుడితో కలిసి హాయిగా ఉండవచ్చునని దేవిగ భావించింది.

ఆ ప్లాన్‌లో భాగంగానే భర్తను చంపేసిన తర్వాత పోలీసులు, మీడియా, కుటుంబ సభ్యుల ఎదుట మద్యం తాగి వేధించినందు వల్ల తానే హత్య చేశానని నమ్మబలికింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిపారు. వినోద్ నాయక్‌(38) ఈ నెల ఏడో తేదీన వేకువజామున మూడు గంటల ప్రాంతంలో తన ఇంటి మూడో అంతస్తులో హత్య జరిగిందని ఫిలింనగర్‌లోని ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హత్యలో మూడో వ్యక్తి

హత్యలో మూడో వ్యక్తి

అక్కడకు వెళ్లిన పోలీసులు.. జగన్ గాయాలతో నేలపై పడి ఉండటాన్ని చూశారు. జగన్ భార్య దేవిక, ఆమె సోదరుడు రమేష్, ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు. జగన్‌ మద్యం తాగి వేధించడంతో కోపంలో చంపేసినట్లు దేవిక తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ హత్యలో మూడో వ్యక్తి ఉన్నట్లు అనుమానించారు. ఈ హత్యలో మూడో వ్యక్తి ఉన్నట్లు అనుమానించారు. పిల్లలను, ఇంటి ఓనర్‌ను విచారించారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు

విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు

ఆ రోజు రాత్రి ఓ వ్యక్తి ఇంటికి వచ్చినట్లు విచారణలో తేలింది. ఆ వ్యక్తి దేవిక ప్రియుడు బెనర్జీగా గుర్తించారు. జగన్‍‌కు విడాకులు ఇచ్చి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత హత్య జరిగింది. ఏడో తారీఖు రాత్రి నిద్రిస్తన్న జగన్‌పై దేవిక హిట్ కొట్టింది.

ప్రియుడితో కలిసి ఉండాలని

ప్రియుడితో కలిసి ఉండాలని

జగన్ అరవడంతో లైట్లు ఆర్పివేసి హిట్‌ను ముక్కులో కొట్టింది దేవిక. బెనర్జీతో కలిసి జగన్‌ను చంపేసింది. ఆ తర్వాత బెనర్జీ షేక్‌పేటలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆవేశంలో హత్య చేశానని ఒప్పుకుంటే ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఉండవచ్చునని దేవిక భావించింది. అందుకే తన ఒక్క దాని పైనే తప్పును వేసుకుంది. గొడవ జరగడంతో ఆవేశంలో చంపేశానని ఆమె కట్టుకథను అల్లింది.

ఇద్దరు పిల్లలు

ఇద్దరు పిల్లలు

కాగా, నిందితులు దేవిక, బెనర్జీని పోలీసులు రిమాండుకు తరలించారు. దేవికకు కుమారుడు(8), కుమార్తె(5) అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. దేవిక కలిసేందుకు రెండు రోజులుగా బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. గురువారం దేవిక, బెనర్జీని కోర్టుకు తరలించే క్రమంలోనూ పిల్లలిద్దరూ అక్కడే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+