ఐదేళ్లుగా సహజీవనం.. మూడుసార్లు గర్భం: 'పెళ్లి' మాటెత్తితే షాక్ ఇచ్చాడు!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన వెంకట ప్రవీణ్ కుమార్(25) హైదరాబాద్ లో ఎంఫార్మసీ పూర్తి చేసి.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గోలముడి వెంకటరమణ(23)

ఖమ్మం: వాళ్లిద్దరూ ఉన్నత చదువులు చదివినవారే.. ఉద్యోగ వేటలో ఇద్దరూ నగరానికి రావడం.. చిన్నప్పటి నుంచి ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. అది ప్రేమకు దారితీయడానికి ఎంతో కాలం పట్టలేదు. పెళ్లి కూడా చేసుకుంటానని అబ్బాయి నమ్మకంగా చెప్పడంతో.. శారీరకంగాను ఆ అమ్మాయి అతనికి దగ్గరయింది.

కానీ మోజు తీరిందో.. వదిలించుకోవాలనుకున్నాడో తెలియదు గానీ.. మొత్తానికి అతగాడు ముఖం చాటేస్తుండటంతో అసలు పంచాయితీ మొదలైంది.

woman protest infront of boyfriend house for cheating

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన వెంకట ప్రవీణ్ కుమార్(25) హైదరాబాద్ లో ఎంఫార్మసీ పూర్తి చేసి.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గోలముడి వెంకటరమణ(23) ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ నిమిత్తం నగరంలోనే ఉంటోంది.

చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం రీత్యా.. నగరంలోను వీరి మధ్య రాకపోకలు నడిచాయి. అలా పదేళ్ల క్రితమే వీరి మధ్య ప్రేమ చిగురించింది. గత ఐదేళ్లుగా నగరంలో ఇద్దరూ ఒకే గదిలో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరమణ మూడుసార్లు గర్భం కూడా దాల్చింది. అయితే ఇప్పుడే పిల్లలు వద్దంటూ ప్రవీణ్ ఆమెకు అబార్షన్స్ చేయిస్తూ వచ్చాడు.

కొద్దిరోజులుగా పెళ్లి పేరెత్తితే ముఖం చాటేస్తూ వస్తున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+