పెగ్గేసి రోడ్డెక్కింది.. మహిళను జుట్టు పట్టి లాగి చెంపపై కొరికేసింది..
హైదరాబాద్ : చుక్క గొంతు దిగాక.. కంట్రోల్ తప్పే మనుషులు.. తిక్కతిక్కగా వ్యవహరించే ఘటనలు చాలానే చూసుంటాం. తాగి తంథనాలు ఆడడం.. నడిరోడ్లపై పిచ్చి వేశాలు వేయడం.. హబ్బో ఒక్కటేమిటి.. మత్తు దిగేదాకా ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్టుగా ఉంటుంది తాగుబోతుల వ్యవహార శైలి.
అచ్చు ఇదే తరహాలో.. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ చౌరస్తాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన ఓ యువతి రోడ్డెక్కి హల్‌చల్ చేసింది. వచ్చే పోయే వాహనదారులకు అడ్డుపడి.. వారిపైకి రాళ్లు రువ్వింది. దీంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అక్కడితో ఆగని యువతి.. పక్కనే తినుబండరాలు అమ్ముకుంటున్న విజయ అనే ఓ మహిళ వద్దకు వెళ్లింది.

ఆపై.. ఆమె పీక పట్టుకుని గట్టిగా నులిమింది. చెంపలపై గట్టిగా కొరికి.. జుట్టుపట్టి లాగింది. మధ్యలో జోక్యం చేసుకోబోయినవారిని నానా దుర్భషాలు అడింది. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. వెంటనే రంగంలోకి దిగి ఆమెను స్టేషన్ కు తరలించారు. మత్తు దిగేవరకు స్టేషన్ లోనే ఉంచి.. తర్వాత ఇంటికి పంపించేశారు. మంగళవారం నాడు మరోసారి స్టేషన్ కు రావాల్సిందిగా ఆదేశించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications