లష్కర్‌లో ముగ్గురు మహిళల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ముగ్గురు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఏపీ టెక్స్‌బుక్‌ కాలనీలో శుక్రవారం ఉదయం ఓ తల్లి, ఇద్దరు కుమార్తెలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్తి తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నారు.

పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసి ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తి తగాదాల కారణంగా కుటుంబ కలహాల నేపథ్యంలో వీరు ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Woman set on fire in empty compartment

ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా వెల్లటూరు మండలం కొండాపూర్ గ్రామంలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులోని నీటి కుంటలో పడి జాడి అనుష్క (5), ధర్శనాల సిద్ధు (3) అనే ఇద్దరు చిన్నారులు మరణించారు. దీపావళి సెలవులు కావడంతో శుక్రవారం కూడా ఇంటి వద్దనే ఉన్న చిన్నారు మధ్యాహ్న సమయంలో ఆడుకునేందుకు వెళ్లారు.

ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పిల్ల కోసం చాలా సేపు గాలించారు. చివరికి చెరువులో వీరిద్దరు విగతజీవులై కనిపింాచరు. పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నారు.

ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య

ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దబండిరేవులో సూరయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట ఎండిపోయిందని మనస్తాపానికి గురై సూరయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+