దుస్తులిప్పేసి స్త్రీపై దాడి: రైలు కింద పడి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని పరిగి మండలం మల్లెమోనిగూడ గ్రామానికి చెందిన అనసూయ బాణామతి చేస్తుందనే నెపంతో స్థానికులు ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. అవమానం భరించలేని అనసూయ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనసూయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లాలోని మహబూబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో కురవి గేటు దగ్గర తల్లీకూతుళ్లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి రైలు కింద పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ-కారు ఢీకొనడంతో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు శ్రీనివాస్ మరణ వార్త విన్న అతడి బాబాయ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందంతో విషాదఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications