వేధింపులతో మహిళ ఆత్మహత్య, నింద భరించలేక విద్యార్థి (పిక్చర్స్)
హైదరాబాద్: కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. కెపిహెచ్‌బి ఎస్సై జానయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా కొత్తపాలానికి చెందిన శ్రీనివాస రావు, శకుంతల కుమార్తె సుకన్య.
సుకన్యకు అదే జిల్లాకు చెందిన మహేష్‌తో పద్నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గుంటూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులు పెళ్లి సమయంలో రూ.5 లక్షల కట్నం ఇచ్చారు.

వివాహిత మృతి
కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

వివాహిత మృతి
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు చేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సుకన్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివాహిత మృతి
అయితే, తాను ఎప్పుడూ అదనపు కట్నం కోసం వేధించలేదని, సుకన్య భర్త చెబుతున్నారు. తామిద్దరం సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

విద్యార్థి ఆత్మహత్య
కాచిగూడ వైశ్య హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీష్ మూడో అంతస్తు నుంచి దూకాడు.
భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మూడు నెలల క్రితం సుకన్య ప్రస్తుతం నిజాంపేట రోడ్డులో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం బెడ్ రూంలోకి వెళ్లిన సుకన్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది.
మరోవైపు, కాచిగూడ వైశ్య హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీష్ మూడో అంతస్తు నుంచి దూకాడు. సెల్ ఫోన్ దొంగిలించాడనే నింద భరించలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications