ప్రేమించి పెళ్లి.. అంతలోనే: ట్రిప్పర్ చక్రాల కింద నలిగిన టెక్కీ, భర్త పరిస్థితి విషమం

హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులో శనివారం నాడు చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్టువేర్ ఇంజినీర్లే.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల ప్రవీణ్ కుమార్, విశాఖపట్నంకు చెందిన 28 ఏళ్ల రమ్యలు కొంతకాలం క్రితం హైదరాబాదుకు వచ్చారు. వారు హైదరాబాదులోని క్యాప్ జెమినీలో సాఫ్టువేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.

పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం

పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం

ప్రవీణ్, రమ్యలు రెండేళ్ల క్రితం అంటే 2016లో పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో ఉంటున్నారు. శనివారం ఇద్దరు ద్విచక్ర వాహనం పైన చిలుకూరు వెళ్లారు. అక్కడి నుంచి వారు తిరుగు ప్రయాణం అయ్యారు.

 చక్రాల కింద చితికిపోయిన భార్య

చక్రాల కింద చితికిపోయిన భార్య

నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ చౌరస్తా వద్ద వారు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. రమ్య ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడింది. అదే టిప్పర్ ఆమె పై నుంచి అదే వేగంతో దూసుకెళ్లడంతో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. ఆమె చక్రాల కింద చితికిపోయింది.

టిప్పర్ డ్రైవర్ అరెస్ట్

టిప్పర్ డ్రైవర్ అరెస్ట్

ఈ ఘటనలో భర్త ప్రవీణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఉద్యోగుల కన్నీరుమున్నీరు

ఉద్యోగుల కన్నీరుమున్నీరు

లారీ వెళ్తున్న విషయాన్ని చూసుకోకుండా ఎడమ వైపుకు వెళ్ళడంతో, అదే సమయంలో లారీ ఎడమ వైపుకు రావడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రమ్య మృతి విషయం తెలిసి తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు సాఫ్టువేర్ ఇంజనీర్లు వెళ్తుండగా ఉప్పల్‌లో బైక్ అదుపు తప్పి కిందపడటంతో యువతిపై నుంచి కారు వెళ్లి చనిపోయింది. డివైడర్ కారణంగా ఈ ప్రాణం పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+