తండ్రి వర్సెస్ కూతురు: ప్రేమ పోరాటంలో రాజీపడని మహిళా టెకీ..

తాను ఎక్కడున్నా.. తన తండ్రి బలవంతంగా తీసుకెళ్లిపోతాడని, అనుదీప్ తో పెళ్లి జరిపించాల్సిందిగా కమలాకర్ రెడ్డిని వేడుకుంది.

కరీంనగర్: హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసే తన కూతురు సహోద్యోగితో ప్రేమలో పడటం ఆ తండ్రికి ఏమాత్రం నచ్చలేదు. నచ్చజెప్పాడు.. బుజ్జగించాడు.. అయినా కూతురు తీరులో మార్పు రాలేదు. ఇక ఇలా కాదని.. కూతురు ప్రేమించిన వ్యక్తిపై దాడి చేయించాడు.

దీంతో ఏకంగా కూతురికి విలన్ గా మారిపోయాడు. తండ్రి పంతం ముందు తన ప్రేమ ఏమాత్రం తక్కువ కాదనుకున్న కూతురు.. ప్రేమించిన వ్యక్తితో బయటకొచ్చేసింది. తండ్రి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో.. పోలీసులు ఇద్దరిని వెతికి పట్టుకొచ్చారు. సదరు యువతిని ఆ తండ్రి ఇంటికి తీసుకెళ్లగా.. ఆమె ప్రేమించిన వ్యక్తి ఆచూకీ మాత్రం మూడు రోజులుగా తెలియకుండా పోయింది.

ఇదీ అసలు కథ:

వరంగల్ గాయత్రి సైన్స్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ డైరెక్టర్ సుదిర శ్రీనివాస్ కుమార్తె గుప్తా శృతి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సహోద్యోగి అనుదీప్ వర్మతో పరిచయం ఏర్పడింది. అనుదీప్ కూడా వరంగల్ కే చెందినవాడు కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది ప్రేమగా మారింది.

Woman techie files a kidnapping complaint to trace her lover

అయితే శృతి తండ్రి శ్రీనివాస్ గుప్తాకు ఈ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. కూతురికి ఎంతనచ్చజెప్పినా వినకపోవడంతో.. అనుదీప్ పై శ్రీనివాస్ గుప్తా దాడి చేయించాడు. కూతురిపై గట్టి నిఘా పెట్టి అనుదీప్ ను కలవకుండా చేశాడు.

తనకు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుదీప్ కు ఫోన్ చేసిన శృతి.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తండ్రి శ్రీనివాస్ గుప్తాను పిలిపించి పోలీసులు మాట్లాడారు. తన పలుకుబడి ఉపయోగించి కూతురిని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయాడు.

ఇదే క్రమంలో మూడురోజులుగా అనుదీప్ ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఇంటినుంచి పారిపోయి కరీంనగర్ లోని అనుదీప్ సోదరి ఇంటికి చేరింది శృతి. సీపీ కమలాకర్ రెడ్డికి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తాను ఎక్కడున్నా.. తన తండ్రి బలవంతంగా తీసుకెళ్లిపోతాడని, అనుదీప్ తో పెళ్లి జరిపించాల్సిందిగా కమలాకర్ రెడ్డిని వేడుకుంది. శృతి విన్నపం మేరకు ఆమెకు పోలీసులు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+