Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉమెన్ హాస్టల్‌‌లో ఘోరం: టెక్కీ స్నానం చేస్తుండగా.. నిర్వాహకుడి కొడుకు ఏం చేశాడంటే..

Recommended Video

    Woman techie Shooted by a Guy while she is Taking Bath | Oneindia Telugu

    హైదర్‌నగర్‌: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో స్నానం చేస్తుండగా ఆ హాస్టల్ నిర్వాహకుడి తనయుడు ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఉదంతమిది.

    ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న ఓ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి రెండ్రోజులు కావస్తున్నా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.

    కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీ ప్రాంతంలో సుమారు 350కి పైగా హాస్టల్స్‌ ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని నిర్వాహకులకు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు.

    Woman Techie Filmed in Hostel Bathroom by Hostel Owner's Son

    అయితే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నది సామెత. కొన్ని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో గుట్టుచప్పుడు కాకుండా ఘోరాలు జరిగిపోతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న ఓ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో జరిగిన ఘటన.

    తాను స్నానం చేస్తుండగా హాస్టల్ నిర్వాహకుడి తనయుడు మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరిస్తుండడం గమనించిన సదరు టెక్కీ ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+