ప్రాణం తీసిన ఫేస్‌బుక్ ప్రేమ! ప్రియుడితో గొడవపడి ప్రియురాలి ఆత్మహత్య!
హైదరాబాద్ : ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, మతం, వయోబేధంలేదని అంటారు. సంగీత ముఖర్జీ, లోకేశ్‌ది అలాంటి కథే. వయసు అంతరం ఉన్నా.. ఫేస్‌బుక్ వారిలో ప్రేమను చిగురింప జేసింది. కలిసి బతికాలన్న ఆశతో ఆ జంట హైదరాబాద్ వచ్చింది. అయితే క్షణికావేశంలో మహిళ తీసుకున్న నిర్ణయం ఇద్దరి జీవితాల్ని నాశనం చేసింది. చిన్న గొడవ కారణంగా వారి ప్రేమ కథ విషాదాంతమైంది.

ఫేస్‌బుక్‌లో పరిచయం
కోల్‌కతాకు చెందిన 45 ఏళ్ల సంగీత ముఖర్జీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమెకు గతంలోనే పెళ్లైంది. కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగీతకు మూడేళ్ల క్రితం పంజాబ్‌కు చెందిన లోకేశ్ (28) పరిచయమయ్యాడు. తొలుత అప్పుడప్పుడు ఛాటింగ్ చేసుకునే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. గతేడాది పంజాబ్ వెళ్లిన సంగీత మూడు నెలల పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత ఇద్దరూ కోల్‌కతాకు మకాం మార్చారు.

ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు
పెళ్లి చేసుకోవాలని భావించిన సంగీత, లోకేశ్‌లు అంతకు ముందు ఉద్యోగం చూసుకుని స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చారు. వనస్థలిపురం సమీపంలోని అభ్యుదయనగర్ కాలనీలో ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకుని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు.

లోకేశ్ అనుమానించడంతో ఆత్మహత్య
మూడేళ్లుగా ప్రేమికుల మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. అయితే ఈ మధ్యకాలంలో లోకేశ్‌కు సంగీతపై అనుమానం మొదలైంది. ఎవరితోనే చాటింగ్ చేస్తోందన్న ఉద్దేశంతో అతడు, ఆమెతో తరుచూ గొడవపడటం మొదలుపెట్టాడు. మంగళవారం సాయంత్రం కూడా ఇదే విషయంపై గొడవ కావడంతో లోకేశ్ మొయినాబాద్‌లోని ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు. దీంతో మనస్థాపానికి గురైన సంగీత హోటల్ రూంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కేసు నమోదు చేసిన పోలీసులు
బుధవారం హోటల్‌కు తిరిగొచ్చిన లోకేశ్ సంగీత ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి విషయం చెప్పాడు. దీంతో వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడగా.. సంగీత బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించింది. తన చావుకు ఎవరూ కారణంకాదని, డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న కారణంతో లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్‌లో ఉంటున్న లోకేశ్ స్నేహితుడి తోనే సంగీత చాటింగ్ చేసినట్లు గుర్తించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications