స్త్రీలకు పోలీస్ వేధింపు, అసభ్యతపై వీడియో తీస్తుంటే

హైదరాబాద్: మహిళల పైన వేధింపులను నిరోధించేందుకు పోలీసు ఉన్నతాధికారులు 'షి' బృందాలను ఏర్పాటు చేశారు. అయితే, ఇద్దరు పోలీసులే స్వయంగా వివాహితలను వేధించి జైలు పాలయ్యారు. కాచిగూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసాచారి, హోంగార్డు శ్రీనివాస్.. బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలను వేధించి అడ్డంగా దొరికిపోయారు.

ఉదయం వేళ వ్యాహాళికి వెళ్లి వస్తున్న సదరు వివాహితలను అయిదారు రోజులుగా ఆ ఇద్దరు వెంబడిస్తున్నారు. తమ బైక్ పైన ఎక్కాలంటూ చేస్తున్న వేధింపులు తారాస్థాయికి చేరడంతో బాధితులు కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిద్దర్ని అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో మంగళవారం వారిని రిమాండుకు తరలించారు.

అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడిపై కేసు

 Women harassed by cops

విద్యార్థినుల పైన అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలోని వీఆర్కే మహిళా మెడికల్ కళాశాలలో వైద్య అధ్యాపకునిగా పని చేస్తున్న నవీద్ గత కొద్ది రోజులుగా కళాశాల వైద్య విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరిస్తున్నారు.

మంగళవారం కూడా ఇలాగే ప్రవర్తించాడు. నగరంలోని మొహిదీపట్నంలో ఉండే ఓ న్యూస్ ఛానల్ విలేకరికి సమాచారం అందించారు. కళాశాలకు చేరుకున్న అతను వీడియో చిత్రీకరిస్తుండగా అధ్యాపకుడు నవీద్‌తో పాటు సిబ్బంది షరీఫ్, మక్బుల్, మొరాజ్ తదితరులు దాడి చేశారు.

విషయం మీడియా సంఘాల ప్రతినిధులకు తెలియడంతో అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. నవీద్ పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విలేకరి పైన దాడి చేసిన వ్యక్తుల పైన కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.

చిన్నారితో అసభ్య ప్రవర్తన, వ్యక్తికి మూడేళ్ల జైలు

చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడుకి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.1000 జరిమానా కూడా విధిస్తూ సైబరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి నాగార్జున్ మంగళవారం తీర్పు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌కు చెందిన రమేష్ లింగంపల్లిలో ఉంటూ క్షౌరశాలలో పని చేసేవాడు. 2013 మే 23న పరిచయమున్న వ్యక్తి ఇంట్లోకి వెళ్లి చిన్నారితో అనుచితంగా ప్రవర్తించాడు. చందానగర్ పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+