Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: మరో దారుణం: సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం: అపస్మారక స్థితిలో.. !

హైదరాబాద్: ఒకవంక వెటర్నరి డాక్టర్ ప్రియాంకా రెడ్డి.. మరోవంక వరంగల్ లో మానసపై అత్యాచారం, హత్యోదంతాలను సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతున్న పరిస్థితుల్లో.. మరో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఒకరు అత్యాచారానికి గురయ్యారు. అత్యాచార నిందితుడితో బాధితురాలికి ముందే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి అపార్ట్ మెంట్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితురాలి పేరు సాయి ప్రియ. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పని చేస్తున్నారు. తన సోదరి హారికతో కలిసి ఆమె నిజాంపేట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. హారిక సింగిల్ విమెన్. భర్తకు విడాకులు ఇచ్చిన హారిక.. నిజాంపేట్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. తన సోదరి సాయిప్రియతో కలిసి నివసిస్తున్నారు. హారికకు రెండో వివాహం చేయాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు మ్యారేజ్ బ్యురోను సంప్రదించారు.

Women software employee raped in her Apartment in Nizampet Hyderabad

ఈ మ్యారేజ్ బ్యురో ద్వారా ఆమెకు జయ చంద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. హారికను రెండో వివాహం చేసుకోవడానికి అతను అంగీకరించాడు. దీనితో తరచూ అతను హారిక నివసించే అపార్ట్ మెంట్ లోని ప్లాట్ వస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను మద్యం మత్తులో హారిక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్లాట్ లో లేరు. సాయిప్రియ ఒక్కరే ఉన్నారు. మద్యం మత్తులో వచ్చిన జయ చంద్ తనకు లక్ష రూపాయలు డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు.

తన వద్ద డబ్బులు లేవంటూ సాయిప్రియ చెప్పడంతో గొడవకు దిగాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగదు, నగలతో ఉడాయించాడు. ప్లాట్ కు తాళం వేసి పారిపోయాడు. ప్లాట్ కు వచ్చిన హారిక అసలు విషయాన్ని తెలుసుకున్నారు. బయటి నుంచి తాళం వేసి ఉండటం, లోపల తన చెల్లెలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసిన ఆమె వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి లోనికి వెళ్లారు. సాయిప్రియను ఆసుపత్రికి తరలించారు. హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని అన్నారు. ముందే పరిచయం ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్లాట్ లోకి సులువుగా ప్రవేశించగలిగాడని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+