ప్రపంచబ్యాంక్‌ను ఏలుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్..!!
వరల్డ్ బ్యాంక్ పై భారతీయ జెండా ఎగిరింది. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడు అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
వాషింగ్టన్: ప్రపంచబ్యాంక్ పై భారతీయ జెండా ఎగిరింది. భారత్ కు చెందిన నిపుణులు పలు ప్రఖ్యాత మల్టీ నేషనల్ కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తోన్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పుడు తాజాగా ఏకంగా ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పగ్గాలు కూడా భారత్ కే దక్కాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూపులు సారిస్తోందనడానికి వరల్డ్ బ్యాంక్ ఓ ఉదాహరణగా నిలిచింది.

అజయ్ బంగా..
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడైన అజయ్ బంగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు డేవిడ్ మల్పాస్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అజయ్ బంగాను ఆ అత్యున్నత స్థానానికి నామినేట్ చేశారు జో బైడెన్.

పుణేలో జన్మించి..
63 సంవత్సరాల అజయ్ బంగా.. మహారాష్ట్రలోని పుణేలో జన్మించారు. ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్ గా పనిచేస్తోన్నారు. గతంలో మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు. ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం ప్రతిష్ఠాత్మక అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఎంబీఏ చదివారు.

అంతకుముందు హెచ్‌పీఎస్ లో..
అజయ్ బంగాకు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరడానికి ముందు- అజయ్ బంగా హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు హెచ్‌పీఎస్ లోనే చదివారాయన. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పని చేశారు. అప్పట్లో ఆయన హైదరాబాద్ కు బదిలీపై రావడం వల్ల తన కుమారుడు బంగాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జాయిన్ చేశారు.

1976లో..
1976లో హెచ్‌పీఎస్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తయిన తరువాత అజయ్ బంగా న్యూఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో జాయిన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే, కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ ఎంపీ కరణ్ బిల్లిమోరియా, ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి.. హెచ్‌పీఎస్ విద్యార్థులే.

శతజయంత్యుత్సవాలు..
ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతజయంత్యుత్సవాలను జరుపుకొంటోంది. 1923లో ఆరుమంది విద్యార్థులతో ఈ స్కూల్ ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు మూడువేలమందికి పైగా విద్యార్థులు చదువుకుంటోన్నారు. బేగంపేట్ లో 130 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్‌పీఎస్.. క్యాంపస్ వాటికన్ సిటీ కంటే పెద్దది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భవనం- చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications