సీఎం రేవంత్ రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక అభినందనలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. నగర రవాణా సౌకర్యాలు, ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్ అంశాలపై ఆయన చూపిన దృష్టిపై ప్రశంసలు కురిపించింది. యూనివర్సల్ గోల్స్ పై స్పష్టమైన అవగాహనతో ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేక స్థానం సంపాదించకుందని కితాబు ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా ఒక లేఖను రిలీజ్ చేసింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన లేఖలో.. రేవంత్ రెడ్డి సమర్థమైన ఆలోచన విధానాన్ని ప్రత్యేకంగా కొనియాడింది. సమాజ హితం కోసం, ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రణాళికలను మెచ్చుకుంది. నగర రవాణా వ్యవస్థను సులభతరం చేసేందుకు అవలంబిస్తున్న ప్రణాళికల గురించి ప్రస్తావించింది. వీటి వల్ల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించవచ్చని రాసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న విధానాల గురించి కూడా డబ్ల్యుఈఎఫ్ లేఖలో మెన్షన్ చేసింది.

World Economic Forum Special Congratulations to CM Revanth

అంతే కాకుండా రాబోయే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా మారుతుందన్న రేవంత్ మాటలను గుర్తు చేసింది. డబ్ల్యుఈఎఫ్ సదస్సుకు హాజరైన పెట్టుబడుదారులకు ఈ మాటలు స్ఫూర్తినిచ్చాయని పేర్కొంది. 2047 నాటికి దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని తొలి కర్భన రహితంగా మార్చాలన్న మీ ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్, అలాగే ఏఐ హబ్ గా, భవిష్యత్ టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు సదస్సులోని బిల్డింగ్ రీజెనరేటివ్, సర్క్యులర్ ప్లేసెస్ సెషన్‌లో పాల్గొన్న పెట్టుబడిదారులను ఆకట్టుకున్నాయని ప్రశంసించింది.

ఆధునిక సాంకేతికత, అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి ఉద్దేశించిన.. మిషన్ రైజింగ్ తెలంగాణ 2050 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.

భవిష్యత్తు ప్రణాళికల అమలు కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ విధానాలు, అభివృద్ధి పథకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+