ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో 'సెన్సేషన్': నగరంలో డీజే వైట్ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో హైదరాబాద్ సరికొత్త సెన్సేషన్‌కు తెరలేపింది. అంతర్జాతీయ డీజేలతో ఈవెంట్స్ నిర్వహించడమే గొప్పగా భావించే ఈ రోజుల్లో ప్రపంచంలో అతిగొప్ప మ్యూజికల్ డ్యాన్స్ ఈవెంట్‌గా పేరుగాంచిన 'సెన్సేషన్' బృందంతో నగరంలో డీజే నిర్వహించనుంది.
డీజే ప్లే, మ్యూజిక్, డ్యాన్స్, క్రాకర్స్, లైటింగ్‌షోతో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ సెన్సేషన్ ఈవెంట్ ప్రపంచంలోని ప్రఖ్యాత నగరాలను కాదని హైదరాబాద్‌ను తన వేదికగా ఎంచుకుంది. ఇందులో భాగంగా సంగీత మాంత్రికుడు డీజీ వైట్ నగరంలో సందడి చేశారు.

నగరంలో డీజే వైట్ సందడి
తెలుపు రంగు దుస్తులు ధరించి, ముఖానికి, తలకి మొత్తం తెలుపు రంగు ధరించి ప్రత్యక్షమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో దశాబ్దం క్రితం ఆవిర్భవించిన సెన్సేషన్ అనతి కాలంలోనే ప్రపంచంలో నంబర్‌వన్ ఈవెంట్‌గా పేరు గాంచింది.

నగరంలో డీజే వైట్ సందడి
లక్షలాది మందిని అలరిస్తూ ప్రపంచంలోని 33 దేశాల్లో ప్రదర్శనలిచ్చింది. 50వేల అభిమానులకు సీటింగ్ అవకాశం ఉండే ఈ ఈవెంట్ ఫిబ్రవరి 6న అంగరంగ వైభవంగా నగరంలో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తాజ్ దక్కన్‌లో గురువారం విలేకరులతో చెప్పారు.

నగరంలో డీజే వైట్ సందడి
సెన్సేషన్ ప్రతినిధి ప్రింటో, పాపులర్ డీజే మిస్టర్ వైట్, ఈవెంట్ నిర్వాహకుడు విజయ్ అమృతరాజ్ సమక్షంలో సెన్సేషన్ నిర్వహణకు హ్యాపెనింగ్ హైదరాబాద్, ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. ఫిబ్రవరి 6న నిర్వహించే ఈ వేడుకకు గచ్చిబౌలి స్టేడియంలో వేదికను 50 అడుగుల ఎత్తులో, 220 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్నారు.

నగరంలో డీజే వైట్ సందడి
పలు దేశాల నుంచి సంగీత అభిమానులు తరలివస్తారు. ఎనిమిది గంటల పాటు నాన్‌స్టాప్‌గా సాగే ఈ ఈవెంట్ టికెట్ ధరను ఇంత వరకు ప్రకటించలేదు. డీజే వైట్ ఒళ్లంతా తెల్లని రంగుతో వచ్చినట్టే కళాకారులు, వీక్షకులు కూడా తెల్లని వస్ర్తాల్లోనే రావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications