ఒకే వేదిక పై చంద్రబాబు, రేవంత్, చిరంజీవి - 'గేమ్ ఛేంజర్'..!!

హైదరాబాద్ వేదికగా అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇందుకు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా నిలుస్తోంది. జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తెలుగు దిగ్గజాలు అందరూ ఒకే వేదిక మీదకు రానున్నారు. కీలక నిర్ణయాలు.. తీర్మానాలకు ఈ వేదిక నాంది పలకనుంది. దీంతో, ఇప్పుడు ఈ పండుగ కోసం రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది.

World Telugu Conference will be held in HICC from Jan 3 to 5th details here

తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపద ప్రధాన అంశాలుగా ఈ మహా సభలు జరగనున్నాయి. తెలుగువారిని సంఘటిత పరచి, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించడం ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అనేక రంగాలకు చెందిన ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు.

చంద్రబాబు, రేవంత్ సహా
జనవరి 3వ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. జనవరి 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వస్తున్నారు. ఈ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరగనున్నాయి. విదేశా ల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ మహాసభల్లోనే 10 మందికి బిజినెస్‌ యాచీవర్‌ అవార్డులు ఇవ్వనున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరవుతున్నారు.

సినీ ప్రముఖుల రాక
ఇక.. సినీరంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధతోపాటు దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో అగ్ర స్థానాల్లో కొనసాగుతున్న తెలుగు ప్రముఖులను ఈ మహా సభలకు ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో తెలుగు భాష ఔన్నత్యం కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే తీర్మానాలు భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా నిలుస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మూడు రోజులు పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+