యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి భారీ ఆదాయం...ఎన్ని కోట్లో తెలుసా..?

తెలంగాణ‌లో ప్ర‌సిద్ధి చెందిన ఆల‌యం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాల‌యం. ఈ ఆల‌యానికి భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ సారి ఆల‌యానికి భారీ ఆదాయం సమకూరింది. జ‌న‌వ‌రి 4 నుంచి28 వ తేది వ‌ర‌కు మొత్తం 25రోజుల్లో రూ. 2.32కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఆల‌య అధికారులు పేర్కొన్నారు.

ఈ తేదీల్లో యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్న అధిక సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్న‌ట్లు తెలుస్తోంది. వీరంతా స్వామివారికి కానుక‌లు స‌మ‌ర్పించారు. ఈ కానుక‌ల్లో రూ .2,32,22,689 నగదు ఉండ‌గా, 230 గ్రాముల మిశ్రమ బంగారం, 4.420 కిలోగ్రాముల మిశ్రమ వెండి ఉన్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

Yadadri Shree Lakshmi Narasimha Swamys huge income...do you know how many crores..?

వీటితోపాటు ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారికి విదేశీ క‌రెన్సీ కూడా ఆల‌య హుండీల్లో కానుక‌ల రూపంలో వ‌చ్చాయ‌ని దేవస్థాన ఈవో రామకృష్ణారావు తెలిపారు. అందులో అమెరికన్ డాల‌ర్లు 593 ఉండ‌గా, యూఏఈ దిర్హామ్స్ 65, ఆస్ట్రేలియా డాలర్స్ 65, కెనడా డాలర్లు 220, 10 సింగపూర్‌ డాలర్లు, 10 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 122 సౌత్‌ ఆఫ్రికన్‌ రాండ్లు, 15 యూరప్‌ యూరోలు, 400 ఒమన్‌ రియాల్‌, 2 మలేషియా రింగిట్స్‌, 23 కతార్‌ రియాల్‌, 100 థాయిలాండ్‌ భాట్‌, 5 న్యూజిలాండ్‌ డాలర్లు, 1000 డెన్మార్క్‌ డ్యానిష్‌ క్రోన్‌, 10,00,000 వియత్నాం డాల‌ర్లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

Yadadri Shree Lakshmi Narasimha Swamys huge income...do you know how many crores..?

లక్ష్మీనరసింహస్వామి ఆల‌యంలో సోమవారం నాడు హరిహరులకు విశేష పూజలు నిర్వ‌హించారు. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన ఆచార్యులు స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించడం జ‌రిగింది. ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయ రీతిలో జ‌రిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+