10 ఎకరాల్లో రూ.10 కోట్లతో యాదవ భవన్(ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో యాదవుల కోసం రూ. 10 కోట్లతో యాదవ భవన్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాదవ భవన్‌తో పాటు విద్యార్ధులకు వసతి గృహం కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని అఖిలభారత యాదవ సంఘం నాయకులు మంగళవారం తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో యాదవ సంఘం ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్న యాదవ కుల సంక్షేమంపై దృష్టి సారించాలని సీఎంను కోరారు. యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి సీఎం స్పష్టంచేశారు.

10 ఎకరాల్లో రూ.10 కోట్లతో యాదవ భవన్
యాదవ భవన్, వసతి గృహం ఏర్పాటుకు మహేంద్ర హిల్స్‌లో పదెకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి తలసాని వెల్లడించారు.

10 ఎకరాల్లో రూ.10 కోట్లతో యాదవ భవన్
60 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా యాదవుల సమస్యను అర్థం చేసుకోలేకపోయిందని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం సానుకూలంగా స్పందించి తమకు వరాలివ్వడం అదృష్టమని పేర్కొన్నారు.
10 ఎకరాల్లో రూ.10 కోట్లతో యాదవ భవన్
యాదవ కులస్థులకు వృత్తి శిక్షణను ఇవ్వడంతోపాటు ఆర్థిక సహకారాన్నందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు.

10 ఎకరాల్లో రూ.10 కోట్లతో యాదవ భవన్
సీఎంను కలిసినవారిలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, నోముల నర్సింహ్మాయ్య, అఖిలభారత యాదవ్ సంఘ నాయకులు లక్ష్మణ్ యాదవ్, మురళీయాదవ్, ఎడ్ల హరిబాబుయాదవ్ తదితరులున్నారు.












Click it and Unblock the Notifications