వరంగల్‌ మరో దారుణం....9వ తరగతి విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్... అవమానం భరించలేక ఆత్మహత్య

తెలంగాణలో రెండవ అతిపెద్దనగరంగా ఎదుగుతున్న వరంగల్ నగరం అంతే స్థాయిలో నేరాలను కూడ మూటగట్టుకుంటుంది. రెండు నెలల క్రితమే పసిపాపను అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన సంఘటన మరవక ముందే మరో అమ్మాయిపై మూకుమ్మడి అత్యాచారం జరిగింది. దీంతో నమ్మించి మోసం చేసిన యువకులను ఎదిరించలేక మానసికంగా కృంగిపోయిన యువతి తానే ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేలుగులోకి వచ్చింది. దీంతో యువతి కుటుంభసభ్యులు ఆందోళన బాట పట్టారు.

వరంగల్ నగరంలో రెండు నెలల క్రితం తోమ్మిది రోజుల పాపను అత్యాచారం చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చేసుకుంటున్న సంగతి తెలిసిందే..అయితే ఇప్పుడు తోమ్మిదవ తరగతి చదువుతున్న మరో అమ్మాయి అత్యాచారానికి గురైంది. బాలికపై తెలిసిన స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధం అయ్యోలోపే బాలిక అత్యాచారానికి గురై పోయింది. స్నేహితులని నమ్మించి ఇతర ప్రాంతానికి వెళ్లిన అమ్మాయిపై అఘాయిత్యం చేశారు. ఇక దోస్తుల అత్యాచారన్ని బయటకు చెప్పుకోలేని యువతి ఆత్మహత్య చేసుకుంది.

young girl studying in the ninth class has been gang-raped

వరంగల్ నగరంలోని హన్మకండ సమ్మయ్యనగర్ కాలనీకి చెందిన యువతి 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం సాయత్రం స్కూల్ నుండి తిరిగి వస్తున్న సమయంలో అయిదుగురు వ్యక్తులతో కలిసి పెంబర్తి తీసుకేళ్లారు. అయిదుగురిలో ఇద్దరు యువతికి తెలిసిన స్నేహితులు ఉండడంతో వారితో వెళ్లినట్టు యువతి తెలిపినట్టు . అయితే అయిదుగురు యువకుల్లో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు యువతి తెలిపినట్టు తెలుస్తోంది.

శుక్రవారం అత్యాచారానికి గురి కావడంతో జరిగిన విషయాన్ని తన యువతి తన నానమ్మతో చెప్పుకుని యువతి భాదపడినట్టు యువతి నానమ్మ తెలిపింది. దీంతో రెండు రోజుల పాటు అవేదనకు గురైన యువతి ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో యువతి కుటుంభ సభ్యులు యువకులను శిక్షించాలంటూ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+