అనుమానాస్పద స్థితిలో రిసార్టులో యువ మోడల్ మృతి
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ యువ మోడల్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి యువ మోడల్ మనోజ్ శంకర్ పల్లి మండలంలోని ఓ రిసార్టులో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చాడు.
సాయంత్రం సమయంలో రెయిన్ డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. పది నిమిషాల తర్వాత లేచి మళ్లీ రెయిన్ డ్యాన్స్ చేశాడు. మిత్రులతో జత కలిశాడు. అయితే, డ్యాన్స్ చేస్తూ రెండోసారి కూడా పడిపోయాడు. దీంతో, మిత్రులు ఆందోళన చెందారు.

యాజమాన్యానికి విషయం చెప్పారు. అయితే, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే మనోజ్‌ను నగరంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అతను మార్గమధ్యలో ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. తుకారం గేట్, బోయినపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, ప్యాట్నీ, మోండా, చిలకలగూడ, పార్శిగుట్ట, ఉప్పల్, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్, బంజారాహిల్స్, కోఠి, పాతబస్తీ, దిల్‌సుక్‌నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.












Click it and Unblock the Notifications