యువ గాయకుడి ఆత్మహత్య: అంతుపట్టని కారణం!, మీర్‌పేటలో కలకలం
సుజిత్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి అని, గత 40ఏళ్లుగా మీర్ పేటలోనే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. నగరానికి చెందిన ఓ ఆర్కెస్ట్రాలో సుజిత్ సింగర్ గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్: కడప జిల్లాకు చెందిన ఓ యువ గాయకుడు మీర్ పేట ప్రాంతంలో ఆత్మచేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11.30గం. సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని సుజిత్(23)గా గుర్తించారు.

సుజిత్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి అని, గత 40ఏళ్లుగా మీర్ పేటలోనే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. నగరానికి చెందిన ఓ ఆర్కెస్ట్రాలో సుజిత్ సింగర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి అతనికి ఎందుకొచ్చిందో అంతు పట్టడం లేదు. సుజిత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కాలనీ అసోసియేషన్ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications