'ఢీ' షో కారణంగా యువతి బలి..అతను మోసం చేశాడంటూ సూసైడ్
ఢీ షో ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఢీ షో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మపై జానీ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచియమైనట్లు శ్రేష్టి వర్మ తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు శ్రేష్టి వర్మ పేర్కొంది.
ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది.ఈ కేసులో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ఘటన మరవక ముందే ఢీ షో నుంచే మరో ఘటన వెలుగు చూసింది. ఢీ షోలో పని చేసిన డ్యాన్సర్ తనని మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

ఖమ్మం జిల్లాలో చెందిన ఓ యువతి ఢీ షోలో డ్యాన్సర్‌గా పని చేస్తోంది. అదే షోలో డ్యాన్సర్ అభితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా అభి తనని దూరంపెడుతున్నాడని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నాడని కూడా యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అతగాడు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి వెల్లడించింది.
ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన
నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ
తనని పెళ్ళి చేసుకుని కాపురం ఉంటూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య… pic.twitter.com/EHBZLr4pS3
ప్రస్తుతం అతను మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని చెప్పి మరీ ఆ యువతి సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి..యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆ యువతి చనిపోయిందని వెల్లడించారు. దీంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications