Tragedy: నీకు.. పాపకు ముఖం చూపించలేకపోతున్నా.. క్షమించు..!

బెట్టింగ్ భూతం యువత ప్రాణాలు తీస్తోంది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన యువత బెట్టింగ్ వలలో చిక్కి ప్రాణాలు కోల్పోతున్నారు. బెట్టింగ్, గేమింగ్, గ్యాంబ్లింగ్ పేరు ఏదైతేనేమీ ఆన్‌ లైన్‌ ఆటలు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలి.. రాత్రికి రాత్రే సంపన్నులు అవ్వాలనే అత్యాశ చివరికి వారి నిండు జీవితాలను నాశనం చేస్తోంది. కన్నవారికి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతుంది. జూదం అనే వ్యసనానికి లోనైన వారు లోన్లు తీసుకుని మరీ ఆడుతున్నారు. ఉన్నదంతా తగలేస్తున్నారు.

ఈ క్రమంలో అప్పులపాలై ఇంట్లోవారి ముందు.. గ్రామంలో పరువు పోతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీటిపై జాగ్రత్తగా ఉండాలని ఓవైపు అధికారులు, పోలీసులు సూచనలు చేస్తున్నా యువత మాత్రం ఈజీమని భ్రమలో పడి నలిగిపోతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం జరిగింది. ఆన్‌ లైన్ బెట్టింగ్‌ కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌ లో భారీ నష్టాలు రావడం.. అప్పుల భారం పెరగడంతో.. చేసేదేం లేకు కట్టుకున్న భార్యను, కన్నకూతురిని వదిలి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు భార్యకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అలాగే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

youngman ensnared betting apps ultimately took his own life a tragedy Yadadri Bhuvanagiri district

వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణుకుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) భువనగిరి పట్టణం లోని బంజారాహిల్స్ కాలనీలోని అద్దె ఇంట్లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి బెట్టింగ్ అలవాటు ఉంది. అలా బెట్టింగ్ యాప్‌ లకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే ఎంత ప్రయత్నం చేసినా బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడలేక పోతున్నానని తనను క్షమించాలని భార్యను కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు భరత్. నీకు.. పాపకు ముఖం చూపించలేకపోతున్నా.. పాప జాగ్రత్త అంటూ లేఖలో తెలిపాడు భరత్. ఇక మృతితో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+