టీవీ నటి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఎంటెక్ విద్యార్థి బురిడీ
హైదరాబాద్: టీవీలో నటిస్తున్న ఓ నటి పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి దుర్వినియోగం చేస్తున్న ఎంటెక్ విద్యార్థి కిరణ్‌ను సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.25వేల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తన పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, దుర్వినియోగం చేస్తుండటాన్ని సదరు నటి గుర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోటోలు పెట్టి అతను దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
బంధువుల సాయంతో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేశాడు. వ్యాపారం సరిగా సాగలేదు. దాదాపు ఏడు లక్షల రూపాయల నష్టం వచ్చింది. వ్యాపారానికి స్వస్తి చెప్పి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. సులభంగా డబ్బు సంపాదించే ఆలోచన కోసం ప్లాన్ వేశాడు.

ఆలోచన రాగానే, బుల్లి తెర నటి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. అనాథ పిల్లల కోసం విరాళాలు పంపించాలని అందులో కోరాడు. కాజీపేట ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చాడు. దీనిని నమ్మి పలువురు విరాళాలు పంపించారు. ఈ డబ్బు డ్రాచేసిన కిరణ్ విలాసాలకు ఉపయోగించాడు.
కిరణ్ నాలుగు నెలల్లో రూ.26 వేల విరాళాలు సేకరించారు. టీవీ నటి ఫోటో ఉండటంతో... అది ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ అని నమ్మి చాలామంది విరాళాలు పంపించారు. పంపించిన వారిలో ఆ నటి స్నేహితులు ఉన్నారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications