రేప్ చేసి, వీడియో తీశాడు: వ్యభిచారం చేయాలని భర్త ఒత్తిడి, ఆత్మహత్య

హైదరాబాద్: పహాడీషరీఫ్‌లో దారుణం జరిగింది. ఓ యువతి పైన రేప్‌కు పాల్పడిన యువకుడు, ఆమెను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పహాడీషరీఫ్ ప్రాంతంలో ఉండే లతీఫ్ ఓ యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, దానిని వీడియో తీశాడు. వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆమె నుంచి చాలా డబ్బులు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడు లతీఫ్‌ను అరెస్టు చేశారు.

Youth arrested for raping girl

నల్గొండ జిల్లాలో మహిళ ఆత్మహత్య

భర్త, ఆయన తల్లి వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని, తనను కాపాడాలని ఓ వివాహిత చేసింది. ఎవరూ కరుణించక పోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఆమె చాలామంది అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలుస్తోంది.

దీంతో, ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని నకిరేకల్ మండలం నోములలో సోమవారం ఉదయం వ్యభిచారం చేయాలంటూ తనను భర్త, అత్తలు బలవంతం చేస్తున్నారని గ్రామానికి చెందిన ఝాన్సీ అనే వివాహిత అధికారులకు లేఖలు రాసింది.

ఈ లేఖలను సదరు అధికారులు చూశారో, లేదో తెలియదు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ తాను అనుభవించిన నరక యాతన, భర్త పెట్టిన చిత్రహింసలను లేఖ రూపంలో వివరించింది.

యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకునేందుకు ముగ్గురు కుమార్తెలతో హుస్సేన్ సాగర్‌‌లో దూకేందుకు వెళ్తున్న మహిళను పోలీసులు కాపాడారు. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చానని దూరంగా ఉంటున్న భర్త మరో యువతితో సంబంధం పెట్టుకొని కుమారుడికి తండ్రయ్యాడని, పిల్లల్ని, తనని పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాధితురాలు పోలీసులతో చెప్పింది.

మల్కాజిగిరికి చెందిన జస్వంత్‌(26), అదే ప్రాంతానికి చెందిన అవినాష్‌ 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని తరచూ భర్త ఆమెను వేధించేవాడు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ ఏడాదిన్నర నుంచి మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు.

వారికి కుమారుడు జన్మించాడు. దీంతో, భార్యా, పిల్లల్ని పూర్తిగా వదిలేశాడు. పిల్లల పోషించాలని కోరింది. భర్త పట్టించుకోలేదు. దీంతో ఆమె పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆదివారం మధ్యాహ్నం తన ముగ్గురు కుమార్తెలను తీసుకొని వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+