పెళ్లి వద్దన్నదని నెట్లో అసభ్య సందేశాలు, అరెస్ట్
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని వలలో వేసుకొని పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించిందని ఓ యువకుడు ఆమెకు అసభ్య సందేశాలు పంపించి వేధిస్తున్నాడు. నిందితుడిని షి బృందం, సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
టోలీచౌకీలో ఉంటున్న మహ్మద్ సమీర్ (22) అనే యువకుడు ఇంటర్మీడియేట్ చదువుకునే సమయంలో స్థానికంగా నివాసం ఉండే ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమె సెల్ ఫోన్ నెంబర్ అతను తీసుకున్నాడు.
ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఇద్దరు కూడా అభిప్రాయాలు పంచుకునేవారు. కొద్ది రోజుల క్రితం అతను పెళ్లి చేసుకుందామని ఆమెతో చెప్పాడు. దానిని ఆ యువతి తిరస్కరించింది.
అప్పటి నుండి సమీర్ ఆమె ఫోన్ నెంబరుకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడు. ఫేస్‌బుక్ ఖాతాలో అశ్లీల రాతలు పోస్ట్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె తండ్రి ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో యువతి తండ్రి షీ బృందానికి ఫిర్యాదు చేశారు. సమీర్ పైన నిఘా ఉంచిన వారు అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
పాతబస్తీలో దారుణం
హైదరాబాద్ పాతబస్తీలో ఓ పహిల్వాన్ ఆగడాలు వెలుగుచూశాయి. ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. ఆ తర్వాత మహిళను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.