బెంగళూరులో ఉద్యోగం: మహిళకు అశ్లీల చిత్రాలు పంపుతున్న అనిల్ అరెస్టు
హైదరాబాద్: అశ్లీల చిత్రాల పంపిస్తూ మహిళను వేధిస్తున్న యువకుడ్ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం ఏసీపీ జయరాం కథనం ప్రకారం - ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ బెంగళూరులో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.ఓ మహిళ కూడా కొంత కాలం ఆ సంస్థలో పని చేసింది.
కొద్ది రోజులుగా అనిల్‌కుమార్ ఆ మహిళలకు మొబైల్, ఇంటర్నెట్, ఫేజ్‌బుక్ ద్వారా అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడ్ని అరెస్టు చేశారు.

యువకుడి అనుమానాస్పద మృతి
కంపెనీలో ల్యాబ్ అసెస్టింట్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సికింద్రాబాదులోని నాచారం పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన మలయాద్రిరెడ్డి కుమారుడు మధుకర్‌రెడ్డి(28)ఆరు నెలలుగా ఓ కంపెనీలోల్యాబ్ అసెస్టింట్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
కొద్దిరోజులుగా కంపెనీలోని కార్యాలయంలో ఉంటున్నారు. కంపెనీ ఉద్యోగులు ఉదయం వచ్చి చూసేసరికి మధుకర్‌రెడ్డి చనిపోయి ఉన్నాడు. కార్మికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మధుకర్‌రెడ్డి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications